శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (12:34 IST)

అలియా భట్-సిద్ధార్థ్ మల్హోత్రాలకు పెళ్లంట.. బిటౌన్‌లో రూమర్స్!!

అలియా భట్.. బిటౌన్‌లో స్మాల్ ఏజ్ హీరోయిన్. ఈమె ఇండస్ట్రీకి వచ్చి చేతుల్లో లెక్కేసుకునే సినిమాలే నటించింది. అప్పుడే పెళ్లి రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అలియా భట్.. మరో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రను పెళ్లాడనున్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఇరు కుటుంబీకులు  ఇటీవల ఓ డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది. 
 
ఈ పెళ్లి రూమర్స్‌పై సిద్ధార్థ్ స్పందిస్తూ... ముందు ఇప్పుడే కెరీర్ ప్రారంభమైందని.. అప్పుడే పెళ్లెందుకు అన్నాడు. కొద్దిరోజుల తర్వాత తాను లవ్ మ్యారేజ్‌ను పెద్దల అనుమతితో చేసుకుంటానని.. కానీ టైమంటూ రావాలని.. నా పెళ్లి టైమ్ వస్తే అదంతట జరిగిపోతుందని కామెంట్ చేశాడు.

అయితే అలియా భట్ మాత్రం ఈ పెళ్లి వార్తలపై మండిపడుతోంది. ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. మరి వీరిద్దరి పెళ్ళెప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే.. సినీ తారల పెళ్ళిళ్లు అంత ఈజీగా జరిగిపోవుగా..?