Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జయదేవ్' వేడుకలో డీజే: స‌భ్య‌స‌మాజానికి ఒక‌టే మెసేజ్ ఇవ్వాల‌నే డైలాగ్ కొట్టాడు.. ఎందుకంటే?

బుధవారం, 28 జూన్ 2017 (18:17 IST)

Widgets Magazine
allu arjun

దాసరి నారాయణ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా "డీజే.. డీజే.." అంటూ అరుస్తూ హంగామా సృష్టించిన అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తాజాగా జయదేవ్ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకలోనూ ఫ్యాన్స్‌కు హితవు పలికారు. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవీ హీరోగా పరిచయం అవుతున్న జయదేవ్ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో బన్నీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. 
 
ఈ సంద‌ర్భంగా వేదిక‌పై బ‌న్నీ మాట్లాడడం మొద‌లుపెట్ట‌గానే అంద‌రూ డీజే.. డీజే అంటూ కేక‌లు వేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో అల్లు అర్జున్‌కి కోపం వచ్చింది. ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన బన్నీ.. ఆపై తాను 'స‌భ్య‌స‌మాజానికి ఒక‌ మెసేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నానంటూ 'డీజే'లోని డైలాగు కొట్టాడు.
 
ఇలాంటి ఫంక్షన్లలో వేదికపై వక్తలు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలన్నారు. స్టేజీపై మాట్లాడే సమయంలో గోల చేయడం సంస్కారం కాదన్నాడు. ఒకరు మాట్లాడడం పూర్తయ్యాక మాత్రమే నినాదాలు వంటివి చేయాలన్నాడు. ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని సూచించాడు. ఆపై గంటా శ్రీనివాసరావు గురించి బన్నీ మాట్లాడుతూ.. ఆయనతో తమకు మంచి సంబంధాలున్నాయన్నారు. వ్యక్తిగతంగానూ, రాజకీయపరంగానూ ఆయనతో లాంగ్ జర్నీ వుందని చెప్పుకొచ్చారు. 
 
మెగాస్టార్ చిరంజీవిని గంటా శ్రీనివాస‌రావు ఇష్ట‌ప‌డ‌తారని, ఆయ‌న‌కు చిరంజీవిపై ఉన్న ఇష్టం వ‌ల్ల త‌న‌కు గంటాపై ఇష్టం మ‌రింత పెరిగింద‌ని బన్నీ కామెంట్స్ చేశారు. తాను ఈ వేడుక‌కు రావ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని గంటా శ్రీనివాస రావు త‌న‌తో అన్నార‌ని చెప్పిన బ‌న్ని.. గంటా కోసం తాను ఇక్కడకి రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రజనీ పాలిటిక్స్‌పై ఫైర్ అయిన కస్తూరి: తమిళనాడులో వేరే సమస్యలు లేవా? అంటూ ప్రశ్న

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఫ్యాన్స్ అసహనం వ్యక్తం ...

news

బేబీ బంప్‌తో బికినీలో సెలీనా జైట్లీ... ఆనందంలో ఇలా షేర్ చేసింది...

బాలీవుడ్ సినీ నటిగా పేరు తెచ్చుకున్న సెలీనా జైట్లీ మళ్లీ గర్భవతి అయ్యింది. తను ...

news

జవానుగా సెప్టెంబర్ 1న వస్తోన్న సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి ...

news

సినీ పరిశ్రమలో ఎవరి స్వార్థం వారిది.. ఉదయ్ కిరణ్ మృతికీ అదే కారణం: శివాజీ రాజా

సినీ పరిశ్రమ ఎవరూ బాధలో ఉన్నా పట్టించుకోదని.. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని మూవీ ...

Widgets Magazine