నా కూతురు నవ్వితే ఎంత కష్టాన్నయినా మరిచిపోతా : అల్లు అర్జున్

ఆదివారం, 12 నవంబరు 2017 (16:01 IST)

Allu Arjun-Arha

ప్రతి తల్లిదండ్రులకు వారివారి పిల్లలంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వెళితే చిన్నారుల నవ్వులు, వారి మాటలు విని వెంటనే తేరుకుని సంతోషంతో ఉండిపోతారు తండ్రి. ఒకవేళ తల్లి కూడా ఏదైనా ఉద్యోగం  చేస్తుంటే ఆమె కూడా ఇలాంటి అనుభూతినే పొందుతుంటారు. అలాంటి అనుభూతిని ప్రస్తుతం సినీనటుడు అల్లు అర్జున్ పొందుతున్నాడు. స్నేహారెడ్డితో వివాహమైన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పిన అల్లుఅర్జున్ కుమార్తె పుట్టిన తరువాత మరింత ఆనందాన్ని పొందుతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా పోస్టులు చేస్తున్నారు. 
 
తాజాగా అల్లుఅర్జున్ పోస్టు చేసిన ఒక ఫోటో సామాజిక మాథ్యమాల్లో అందరినీ ఆనందింపజేస్తోంది. తన కుమార్తె అల్లు అర్హా, తల్లి స్నేహారెడ్డితో నవ్వుతూ తీసిన ఫోటోను పోస్టు చేశారు అల్లు అర్జున్. ఈ ఫోటోను లక్షలాదిమంది అభిమానులు చూసి అల్లు అర్జున్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మీ అంత సంతోషమైన కుటుంబం ప్రపంచంలో ఉండదు... ఎంజాయ్ అంటూ కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులకు అల్లు అర్జున్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నారు.



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని ...

news

లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి వార్నింగ్... ఆమె నిజస్వరూపం బయటపెడతాం

స్వర్గీయ ఎన్.టి.రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతికి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్ర ...

news

హీరోలు రాజకీయాల్లోకి రావడం దేశానికి విపత్తు: ప్రకాశ్ రాజ్

తమిళ అగ్రహీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌లు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ...

news

ఆ హీరోతో తొలి ముద్దు అనుభవం మరిచిపోలేను : మాజీ మిస్ ఉత్తరాఖండ్

తెలుగు చిత్రపరిశ్రమలో అచ్చతెలుగు ఆడపిల్లగా కనిపించే హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. ...