శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2015 (12:42 IST)

రుద్రమదేవి ఆలస్యంగా విడుదల చేసి బ్రూస్‌ లీని తిట్టడమెందుకు...? దాసరికి అల్లు అర్జున్‌ కౌంటర్

"బ్రూస్‌లీ చిత్రం ఈ నెల 16 న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ముందుగానే ప్ర‌కంటించారు. రుద్ర‌మ‌దేవి విడుద‌ల తేదీని నిర్మాత‌లు కొన్ని కార‌ణాల వ‌ల‌న ముందుకు జ‌రుపుకుంటూ వ‌చ్చారు. షెడ్యూల్ ప్ర‌కారం రుద్ర‌మ‌దేవి సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కావ‌లిసింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల‌న అక్టోబ‌ర్ 9న విడుద‌ల‌య్యింది. 
 
కాని షెడ్యూల్ ప్ర‌కారమే బ్రూస్‌ లీ అక్టోబ‌ర్ 16న విడుద‌ల కానుంది. ఆ విష‌యం తెలిసే నిర్మాత‌లు రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని అక్టోబ‌ర్ 9న విడుద‌ల చేశారు. దీనికి బ్రూస్‌లీ నిర్మాత‌ల్ని బ్లేమ్ చెయ్య‌న‌క్క‌ర్లేదు. వారు ముందుగా ప్ర‌కంటించిన షెడ్యూల్ ప్ర‌కారం విడుద‌ల చేస్తున్నారు. కాబ‌ట్టి ఈ రెండు చిత్రాలు కూడా స‌మానంగా  ప్ర‌జాదర‌ణ పొందుతాయ‌ని ఆశిస్తున్నాను" అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. కాగా దాసరి నారాయణ రావు బ్రూస్ లీ చిత్రం విడుదలను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయడంపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.