గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2015 (13:29 IST)

సూర్యతో కలిసి నటించాలనుకున్నా.. అంతలో పెళ్లైపోయింది: అమలా పాల్

సూర్యతో కలిసి నటించాలనుకున్న ఆమె కల నెరవేరకపోయింది.. అంతలా పెళ్ళి కూడా అయిపోయింది. ఇక ఆయనతో నటించే ఛాన్స్ అంతే అనుకుంది. కానీ అక్కడే సీన్ మారింది. కోలీవుడ్ అందగాడైన సూర్యతో కలిసి నటించే ఛాన్స్ అమ్మడు అదేనండి.. అమలా పాల్‌కు లభించింది. దీంతో అమ్మడు సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. సూర్య అంటేనే పడిచచ్చే అమలాపాల్ ఆయనతో యాక్ట్ చేసే సినిమాలో తాను భాగం కావడంపై ఎగిరిగంతేస్తుంది. 
 
ఇంతకీ.. అమలాపాల్ తెలుగుతో పాటు తమిళంలోను అగ్రహీరోల సరసన నటించింది. విజయ్, విక్రమ్ లాంటి అగ్రకథానాయకుల సరసన నటించిన ఆమెకి 'సూర్య'తో నటించాలనే కోరిక ఉండేదట. అయితే ఈ లోగా తనకి వివాహం కావడంతో, ఇక ఆ కల నెరవేరడం కష్టమేనని అనుకుంది. కానీ 'పసంగ 2' సినిమాలో ఆయనతో కలిసి నటించే ఛాన్సొచ్చింది. ఈ సినిమా రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. తెలుగులో ఈ సినిమాను మేము పేరుతో విడుదల చేయనున్నారు.