Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:17 IST)

Widgets Magazine
rajinikanth

కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. రజనీకి రాజకీయాలొద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రజనీకాంత్ రాజకీయాల వైపు దృష్టి పెట్టకూడదనుకుంటున్నట్లు కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇప్పటికే తమిళ రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్న వేళ... తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటోంది. 
 
ప్రస్తుత అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సన్నద్ధమైనట్లు సమాచారం. రజనీతో ఆరెస్సెస్ నేత గురుమూర్తి ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. అయితే, రజనీ నుంచి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 
ఏదేమైనప్పటికీ, ఈ వార్త తమిళనాడులో సంచలనంగా మారింది. రాజకీయపరంగా మరింత వేడిని పెంచుతోంది. ఇదిలా ఉంచితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని గురుమూర్తి శుక్రవారమే ప్రకటించారు. రజనీకాంత్ బీజేపీలో టచ్ ఉన్నారని, వీరద్దరి మధ్య ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త గురుమూర్తి సయోధ్య కుదురుస్తున్నారంటూ మీడియో తెగ హడావిడి చేసింది. 
 
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలన్నీ ఉత్తుత్తిదేనని.. రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు అనేది అవాస్తం అని గురుమూర్తి స్పష్టం చేశారు. రజనీకాంత్ బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని కొట్టిపారేశారు. మీడియాలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదని ట్వీట్‌ చేసిన రజనీకాంత్ ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Aiadmk Sasikala Rajinikanth Dilemma Bjp Tamil Nadu Ops War

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎన్టీఆర్ సినిమాకు అభయ్ రామ్ టెంకాయ కొట్టాడు.. తాత సాయం చేశాడు... వీడియో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాను బాబి దర్శకత్వంలో నందమూరి ...

news

పెళ్లైన ఓ వ్యక్తి ఎంగేజ్‌మెంట్ అయ్యాక ప్రపోజ్ చేశాడు.. భార్యకు విడాకులిస్తానన్నాడు: లాస్య

బుల్లితెర మీద యాంకర్లు హాట్ హాట్‌గా కనిపిస్తూ.. వెండితెరపై తమ సత్తాను ...

తల వంచుకుని వెళ్లి, తలవంచుకుని ఇంటికి రా నాన్నా.. తైమూర్‌కు కరీనా హితబోధ

ఏ క్షణంలో తమకు పుట్టిన మగబిడ్డకు మంగోలు మహారాజు తైమూర్ అని కరీనా కపూర్‌ దంపతులు పేరు ...

news

పవన్ కళ్యాణ్‌ను దాటి నంది ముందుకెళుతుందా..!

నంది అవార్డుల కమిటీ చురుగ్గా పనిచేస్తోంది. దాదాపు ఐదేళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత అవార్డులు ...

Widgets Magazine