గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (17:54 IST)

ఎమీ చేతిలో ఎనిమిది చిత్రాలు.. మరో రెండేళ్లు బిజీ బిజీ..

'మదరాసపట్టినం' సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఇంగ్లాండ్ భామ ఎమీ జాక్సన్. ప్రస్తుతం అమ్మడు ''దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకో'' సూత్రాన్ని ఫాలో అవుతున్నట్టుంది. వస్తున్న అవకాశాలన్నిటినీ చేజిక్కించుకుంటూ క్షణం తీరిక లేనంతగా బిజీ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఎమీ చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నట్టు సమాచారం.
 
ఎమీ ఆ మధ్య తెలుగులో 'ఎవడు' సినిమాలో నటించిన తర్వాత తమిళంలో విక్రం సరసన 'ఐ' చిత్రంలో నటించింది. ఆ సినిమాపై ఎమీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అది బోల్తా పడింది. అయితేనేమీ ఎమీ క్రేజ్ ‌మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. అందుకు మారుగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఎమీ చేతిలో రెండు కోలీవుడ్ చిత్రాలు, మరో మూడు సినిమాలకు ఉన్నాయట. 
 
వీటితో మరో ఏడాది కాలానికి ఎమీ డైరీ ఫుల్ అయిపోయిందట. అంతేకాదండోయ్ ఆ తర్వాత సంవత్సరంలో చేయడానికి కూడా మరో మూడు సినిమాలు డేట్స్ ఇచ్చేసిందట. దీంతో అమ్మడు మరో రెండేళ్లు బిజీ బిజీ అంటూ ఎమీ సన్నిహిత వర్గాల సమాచారం.