గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (17:13 IST)

మల్టీస్టారర్ మూవీ: మంచు విష్ణుతో అమీరా దస్తర్ రొమాన్స్!

బాలీవుడ్ హీరోయిన్ అమీరా దస్తుర్ మంచి విష్ణుతో రొమాన్స్ చేయనుంది. పూరీ జగన్నాథ్ తెలుగు- కన్నడ ద్విభాషా చిత్రమైన రోగ్‌లో నటిస్తున్న అమీరా దస్తుర్... మంచు విష్ణు హీరోగా నటించే మల్టీస్టారర్ సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.
 
ఇదే సినిమాలో రాజ్ తరుణ్- అవికా గోర్‌ల యువ జంట కూడా కనిపిస్తుందని సమాచారం. ఒకవేళ అవికా గోర్ ఈ ఛాన్సును మిస్ చేసుకుంటే హేబా పటేల్‌ను రంగంలోకి దించేందుకు దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుందని.. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.