శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 28 జులై 2015 (18:32 IST)

యూరప్‌లో పాటల చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘అనగనగా ఒక చిత్రమ్’

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్‌గా, జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలిమ్స్ సమర్పణలో సూపర్‌హిట్ అయిన ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకులు జె. ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్తున్న పూర్తి హాస్యరస ప్రేమకథా విచిత్రమ్ ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటల చిత్రీకరణ యూరప్‌లోని జార్జియా దేశంలో 10 రోజుల పాటు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు.
 
జార్జియా దేశ రాజధాని టిబ్లిసి, అనానురి, స్నో మరియు కాస్‌బెర్గ్ తదితర ప్రకృతి అందాలు కలబోసిన పచ్చని ప్రాంతాలలో రఘు నృత్య దర్శకత్వంలో చిత్రీకరించారు. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య స్వరపరచిన గీతాలలో అడగర్ల కరుణాకర్ రచించగా.. సింహా, ఉమా నేహా గానం చేసిన.. ‘లంగా ఓణీ పిల్లా.. నీ లంగరేసెయ్ ఇల్లా.. నీ సెంగుచాటు సింగారాలు ఇస్తావా మల్లా’ను మాస్ ప్రేక్షకులను అలరించే పాటగా హీరో, హీరోయిన్, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించారు.
 
మిట్టపల్లి సురేందర్ రచించగా.. సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గానం చేసిన ‘నిన్ను చూడందే హృదయం నిలవదు ఏ చోటా.. చిట్టి చిట్టి నీ మదిని చుట్టిముట్టి ఎదనే ఎదతో తెచ్చుకుంటా ముడిపెట్టి’ పాటను హీరోహీరోయిన్‌లపై మాంటేజ్ సాంగ్ చిత్రీకరించారు. గోసాల రాంబాబు రచించగా రేవంత్, మాళవిక గానం చేసిన ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకే.. ఓ సజనా.. సజనా.., ఒక్కసారి నన్ను చూసి నవ్వవెందుకే’ యుగళ గీతాన్ని హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించారు.
 
ఇక్కడ తొలిసారిగా షూటింగ్ జరుపుకున్న తెలుగుచిత్రం మాదే కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. అక్కడి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందించారు. ఈ తరహా ప్రోత్సాహం వల్ల మరిన్ని చిత్రాలు ఇక్కడ చిత్రీకరించుకునే అవకాశం మెండుగా ఉంది. యూనిట్ అంతా ఎంతో సహకరించి మూడు పాటలు బాగా రావడానికి తోడ్పడ్డారని, ఆగష్టు మొదటి వారంలో ఆడియో వేడుకలను భారీ ఎత్తున నిర్వహించి అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాతల్లో ఒకరైన కొడాలి సుబ్బారావు తెలియజేశారు. 
 
దర్శక, నిర్మాత జె. ప్రభాకర్‌రెడ్డి మరిన్ని వివరాలు తెలియజేస్తూ.. ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణకు సోని ఎఫ్65 కెమెరాను వినియోగించామని, అద్భుతమైన ఫ్రేమింగ్, గ్రాండియర్‌ లుక్ ఈ కెమెరా ప్రత్యేకత అని, ఈ కారణంగా ప్రేక్షకులు ఓ అందమైన అనుభూతిని పొందుతారని, రీ-రికార్డింగ్ పూర్తయిందని, డీటీఎస్, గ్రేడింగ్ వంటి పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో ఫైనల్ మిక్సింగ్ పూర్తిచేసుకుంటుందని అన్నారు. 
 
నటీనటులు: శివ, మేఘశ్రీ, జయ ప్రకాష్ రెడ్డి, షియాజిషిండే, వెన్నెల కిశోర్, ప్రభాస్ శ్రీను, సూర్య, గిరిబాబు, రఘు బాబు, పృథ్వీ, అనంత్, జోగి బ్రదర్స్, దువ్వాసి మోహన్, గుండు సుదర్శన్, అల్లరి సుభాషిని, కృష్ణవేణి (భాహుబలి ఫేం) , బ్యాంకు విజయ్, వాజ్ పాయ్, కోటేశ్వర రావు, గగన్, డి.వి.మధు. 
 
సాంకేతిక వర్గం: కథ, మాటలు - అజయ్ , ఫోటోగ్రఫీ - వి రవి కుమార్, సంగీతం - వినోద్ యాజమాన్య, ఎడిటింగ్ - టి సాయి బాబు, ఆర్ట్ - విజయ్ కృష్ణ, మేకప్ - రంగా, కాస్టుమ్స్ - కె మురళి, స్టిల్స్ - బాలు, పి.ఆర్. ఓ. - బాలాజీ శర్మ, పబ్లిసిటీ డిజైన్స్ - వెంకట్ యమ్, నిర్మాణ నిర్వహణ - నల్లూరి శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ -  కొడాలి - శ్రీనివాస రావు , ప్రొడక్షన్ మేనేజర్ - ఆర్. రాంబాబు, అసిస్టెంట్ డైరక్టర్స్ - సుదర్శన్, హరీష్ సజ్జా, అసోసియేట్ డైరెక్టర్స్ - ఉమేష్ నాగ, డి. యమ్. మంజునాథ్ సజ్జన్, కో డైరెక్టర్ - ఎస్. నాగ శ్రీనివాసరావు, నిర్మాతలు - కొడాలి సుబ్బారావు, జె.ప్రభాకరరెడ్డి:, డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - జె. ప్రభాకరరెడ్డి.