Widgets Magazine

అమ్మాయిని ఐటమ్‌లా చూడకండి.. నేను ఐటమ్ సాంగ్ కాదు.. స్పెషల్ సాంగ్ చేస్తున్నా: అనసూయ

మంగళవారం, 29 నవంబరు 2016 (15:14 IST)

Widgets Magazine

సాయిధరమ్ తేజ్ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ పాటపై భారీ అంచనాలున్నాయి. ఈ పాటలో అమ్మడు అందాలను ఆరబోయనుందని టాక్ వస్తోంది. సాయిధరమ్ తేజ్ సినిమా విన్నర్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, బేబి భ‌వ్య సమర్పణలో... న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 
 
గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆసక్తి చూపని అనసూయ.. సాయిధరమ్‌తో స్టెప్పులేసేందుకు ఓకే చెప్పింది. ఈ పాట కోసం అనసూయ 12 కేజీలు బరువు తగ్గిందట.

సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ స్పెషల్ సాంగ్‌లో అందంగా కనిపించేందుకు అనసూయ స్పెషల్ కేర్ తీసుకుందని.. మాస్ ప్రేక్షకులకు తన పాట ద్వారా బిగ్ ట్రీట్ ఇవ్వనుందని టాక్ వస్తోంది. ఈ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. అనసూయ భారీ పారితోషికం తీసుకుని నటించిన ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. 
 
అయితే విన్నర్లో ఐటమ్ సాంగ్ చేస్తున్నావా? అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు అనసూయ క్లాజ్ తీసుకుంది. ఐటమ్ సాంగ్ అని చెప్పకండి.. అది స్పెషల్ సాంగ్ అని చెప్పింది. ఐటమ్ అంటే అర్థం తెలుసా? ఐటమ్ అంటే ఓ వస్తువు. తనకు ఛాన్స్ దొరికితే క్లాజ్ పీకుతానంటూ.. అమ్మాయిని ఐటమ్ లాగా చూస్తారని అప్పట్లో లాంగ్వేజ్‌లు రానివారు అలా పిలిచారు. అమ్మాయి ఐటమ్ కాదు. 
 
విన్నర్లో తాను చేసేది స్పెషల్ సాంగ్. ఆ పాట సినిమాకు స్పెషల్ కావాలి కాబట్టి.. తాను స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులేయడం జరిగిందని చెప్పారు. మోడల్ అయినా నటీమణి కాకపోయినా.. మీకోసం వచ్చి డ్యాన్స్ చేసి ఎంటర్‌టైన్ చేసే అమ్మాయి ఐటమ్ కాదని, ఆమె కూడా ఓ మహిళ అని హితవు పలికారు.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

రోబో 2.0 కోసం దేశాన్నే క్రియేట్ చేస్తున్న శంకర్.. రజనీకాంత్ కోసమే ఇదంతా?

కబాలి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ సూపర్ స్టార్ ...

news

సినిమా కోసం బాన పొట్టను పెంచాడు.. తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడిన హీరో ఎవరు? (వీడియో)

సాధారణంగా హీరోలు... హీరోయిన్లు నిరతరం తమ ఫిట్నెస్‌ని కాపాడుకుంటూ వస్తారు. ఇందుకోసం వారు ...

news

లిమిట్ లేకుండా గ్లామరస్‌గా కనిపిస్తానంటున్న కీర్తి సురేష్.. ఒకే చేస్తున్న హీరోలు

కీర్తి సురేష్. వెండితెరకు పరిచయమైన మలయాళ కుట్టి. ఈ భామ మాంచి రైజింగ్‌లో ఉంది. దీంతో ఇటు ...

news

కాంచన రీ ఎంట్రీ.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్‌కి బామ్మగా కనిపిస్తారట..

ఒక్కప్పటి హీరోయిన్లు ప్రస్తుతం సీనియర్లు అవుతున్నారు. అలాంటి అలనాటి నటీమణులు అమ్మ, బామ్మ ...