బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (12:07 IST)

పెళ్లైన ఓ వ్యక్తి ఎంగేజ్‌మెంట్ అయ్యాక ప్రపోజ్ చేశాడు.. భార్యకు విడాకులిస్తానన్నాడు: లాస్య

బుల్లితెర మీద యాంకర్లు హాట్ హాట్‌గా కనిపిస్తూ.. వెండితెరపై తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. ఈ లిస్టులో అనసూయ, రేష్మి, శ్రీముఖి, లాస్య వంటివారున్నారు. అయితే తెరపై సాంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించి పాపు

బుల్లితెర మీద యాంకర్లు హాట్ హాట్‌గా కనిపిస్తూ.. వెండితెరపై తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. ఈ లిస్టులో అనసూయ, రేష్మి, శ్రీముఖి, లాస్య వంటివారున్నారు. అయితే తెరపై సాంప్రదాయ వస్త్రధారణలోనే కనిపించి పాపులర్‌ అయిన యాంకర్‌ లాస్య. ముఖ్యంగా కో-యాంకర్‌ రవితో ఆమె కాంబినేషన్‌ సూపర్‌ హిట్‌ కాక తప్పదు. వారిద్దరి జోడీ బుల్లితెర అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. అయితే ఇటీవల కాలంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని లాస్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక భవిష్యత్తులో అతనితో కలిసి యాంకరింగ్ చేయనని స్పష్టం చేసింది. 
 
బాగా పాపులర్ అయిన ఇగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇదే సమస్యతో యాంకర్ రవికి తనకు మనస్పర్ధలు వచ్చాయని లాస్య చెప్పింది. ముఖ్యంగా రవికి, నాకు మధ్య ఏదో ఉందని వార్తలు తెగ ప్రచారం అయిపోయాయి. ఆ రూమర్లు మా కుటుంబ సభ్యులను చాలా ఇబ్బంది పెట్టాయి. ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకే రవితో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో అతనితో కలిసి పనిచేయనని లాస్య చెప్పేసింది. తనకు కాబోయే శ్రీవారు మంజునాథ్‌తో ఏడేళ్ల పాటు ప్రేమాయణం సాగుతోంది.. సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుందామని.. ఇన్నాళ్లు వేచి వున్నాం.. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చానని తెలిపింది. మార్చి నుంచి మళ్లీ కెరీర్ ప్రారంభిస్తానని లాస్య చెప్పుకొచ్చింది. 
 
ఇదిలా ఉంటే యాంకర్ లాస్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసినదే. మంజునాథ్ అనే చుట్టాలబ్బాయితో ఇప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. అయితే పెళ్లి కాకముందే ఈ జంట ఓ చానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో లాస్యకు యాంకర్ రవితో గల గొడవల గురించి అడిగారు. ఈ సందర్భంగా లాస్య మాట్లాడుతూ.. రవి పర్సనల్ ఫ్రెండ్ కాదని, ప్రొఫెషనల్‌గా క్లోజ్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చింది. రవితో ప్రేమాయణం లేదని.. రవి చాలా సందర్భాల్లో తనకు లైఫ్ ఇచ్చానని మాట్లాడితే కోపం వచ్చిందని.. అలా మా మధ్య విబేధాలొచ్చాయని లాస్య చెప్పుకొచ్చింది. రవితో పెళ్లైపోయిందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. తెలిసీ తెలియకుండా వార్తలు రాయొద్దని లాస్య మీడియాకు హితవు పలికింది. అన్నీ తెలుసుకుని వార్తలు రాయాలని తెలిపింది. 
 
ఇంకా మా ఎంగేజ్‌మెంట్ ఫోటోల పక్కనే రవి ఫోటో రావడం మాకిష్టం లేదని.. ఇప్పటికైనా వదిలేయండ్రా బాబూ అనుకున్నానని లాస్య చెప్పింది. తన ఎంగేజ్‌మెంట్‌కు రవి రాలేదని.. ఆయన ఏడ్చినట్లు వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదని, ఒకవేళ ఇంట్లో ఏడ్చి వుంటాడేమోనని.. మీడియాకు చెప్పివుంటాడేమోనని లాస్య అనుమానం వ్యక్తం చేసింది. మంజునాథ్‌తో ఏడేళ్ల క్రితమే పెళ్లైపోయిందని, రాజ్‌తరుణ్‌తో కూడా తనకు వివాహం జరిగిందని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని లాస్య చెప్పుకొచ్చింది. ఓ పెళ్ళైన వ్యక్తి తనకు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత లవ్ ప్రపోజ్ చేయడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని లాస్య చెప్పింది. ఈ పెళ్లైన వ్యక్తి రవేనని టాలీవుడ్‌లో జోరుగా చర్చ సాగుతోంది. రవి తన భార్యకు విడాకులు ఇచ్చి లాస్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి వుంటాడని వార్తలు వస్తున్నాయి.