Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుడిగాలి సుధీర్‌తో ప్రేమా లేదు.. పెళ్లీ లేదు: ఫేస్‌బుక్ లైవ్‌లో రష్మీ

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (09:15 IST)

Widgets Magazine
Rashmi

సుడిగాలి సుధీర్‌తో ప్రేమ వ్యవహారంపై ఫేస్‍‌బుక్ లైవ్‌లో రష్మీ స్పందించింది. ఫేస్‌బుక్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన రష్మీ... సుధీర్‌తో కలిసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తుండటం వల్ల అలాంటి భావన ప్రేక్షకులకు, అభిమానులకు కలిగివుండవచ్చునని రష్మీ చెప్పింది. తాము చేస్తోన్న షో మంచిగా రావడం కోసం  మిగతా వాళ్లతో ఉన్నట్టుగానే సుధీర్‌‍తోను కాస్త సన్నిహితంగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. 
 
అలా సన్నిహితంగా వుండటం చూసి ప్రేమలో వున్నామని, పెళ్లి చేసుకుంటామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రష్మీ వెల్లడించింది. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన రష్మీ తాజా సినిమా 'నెక్స్ట్ నువ్వే' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులతో రష్మీ ఫేస్‍బుక్ లైవ్‌లో మాట్లాడింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకి చాలా వరకూ సహనంతో మాట్లాడిన రష్మీ, అప్పుడప్పుడు కాస్తంత అసహనానికి కూడా లోనైంది.
 
అంతేగాకుండా నెక్ట్స్ నువ్వే చిత్రం ఫ్లాప్ కావడం ఖాయం. నేను డిసైడ్ అయ్యాను అని ఓ నెటిజెన్ చేసిన వ్యాఖ్యలపై రష్మీ ఒకింత అసహనం వ్యక్తం చేసింది. సినిమా ఫ్లాప్ లేదా హిట్ అనేది ఏ ఒక్కరిపైనా ఆధారపడి ఉండేది కాదు. కావున మీరు అలా కోరుకుంటే బెస్టాఫ్ లక్ అని రష్మీ వ్యాఖ్యానించింది. నెగిటివ్‌గా థింక్ చేయకూడదు అని సలహా ఇచ్చింది. 
 
తెలుగు భాష మాట్లాడటం రాని నువ్వు తెలుగు సినిమాల్లో నటించడం మానుకో అని ఓ నెటిజన్ చేసిన కామెంట్స్‌కు రష్మీ మండిపడింది. వైజాగ్‌లో పుట్టి పెరిగాను. తల్లి ఒరిస్సా, తండ్రి యూపీకి చెందిన వాళ్లు. నేను కేంద్రీయ విద్యాలయాల్లో చదివాను. అక్కడ ప్రాంతీయ భాషను ప్రోత్సహించరు. కేవలం హిందీనే నేర్పిస్తారు. కేవలం భాష, ప్రాంతం, కులాన్ని ఆధారంగా చేసుకొని ఒకరి ప్రతిభను అంచనా వేయవద్దు అని రష్మీ  ధీటుగా సమాధానం ఇచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒళ్లు కొవ్వెక్కి బూతులు రాస్తున్నారు.. వెబ్‌సైట్ నిర్వాహకులపై హేమ ఫైర్

వెబ్ సైట్ నిర్వాహకులపై సినీ నటి హేమ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. తమ భార్యాపిల్లల్ని ...

news

ఓ హీరో.. ఓ హీరోయిన్‌ల ప్రేమ కథ... నేడు మూడు ముళ్లబంధంతో ఒక్కటవుతారు...

ఓ అందమైన అబ్బాయి... ఓ అపురూపమైన అమ్మాయి. వీరిద్దరి మతాలు వేరు.. ఇద్దరి భాషలు వేరు.. ...

news

అబ్బా.. మళ్లీ అనుష్కతో స్నేహమేనంటున్న ప్రభాస్..

బాహుబలి సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, దేవసేన అనుష్కల మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ ...

news

నా భర్త బంగారం... ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు : రేణు

తనపై తాజాగా వస్తున్న కామెంట్లపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన ఫేస్బుక్ ఖాతాలో ...

Widgets Magazine