శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (16:31 IST)

బర్త్‌డే పార్టీలో రెచ్చిపోయిన యాంకర్ శ్యామల... ఓ పెగ్గేసి డ్యాన్స్ చేసిందా?

తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్లకు కూడా మంచి పేరుంది. ఇలాంటి వారిలో రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటివారు గ్లామర్‌ క్వీన్‌లుగా వెలిగిపోతున్నారు. సుమ అచ్చతెనుగు ఆడబిడ్డలా కనిపిస్తూ తన మాటతీరుతో ప్రతి ఒక

తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్లకు కూడా మంచి పేరుంది. ఇలాంటి వారిలో రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటివారు గ్లామర్‌ క్వీన్‌లుగా వెలిగిపోతున్నారు. సుమ అచ్చతెనుగు ఆడబిడ్డలా కనిపిస్తూ తన మాటతీరుతో ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. రష్మీ, అనసూయ, శ్రీముఖిలు మాత్రం తమ యాంకరింగ్‌తో పాటు తమ వేషధారణతో ప్రత్యేకంగా కనిపిస్తారు. అదుకే సినిమా ఆడియో ఫంక్షన్లలో హోస్టులుగానూ, సినిమా తారలుగానూ వెలిగిపోతున్నారు. వీరికి కాస్తభిన్నంగా కనిపించే యాంకర్ శ్యామల. ఎక్కవగా చీరల్లోనే దర్శనమిస్తూ గ్లామర్‌ షోకు కాస్త దూరంగా ఉంటుంది. 
 
కాస్త హుందాగా, తెలుగుదనం ఇట్టే ఉట్టిపడేలా యాంకరింగ్‌ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే రీసెంట్‌గా జరిగిన తన బర్త్‌డే పార్టీలో మాత్రం శ్యామల గేర్‌ మార్చేసింది. వెస్ట్రన్‌ స్టైల్లో గ్రాండ్‌గా బర్త్‌డే చేసుకుంది. అతిథులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఈ సారి తన బర్త్‌డే గ్రాండ్‌గా జరిగిందని, ఈ పుట్టినరోజును జీవితంలో మర్చిపోలేనని తెలిపింది శ్యామల. బర్త్‌డే ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది. అతిథులతో కలిసి ఓ పెగ్గేయడం వల్లే ఇలా ప్రవర్తించివుంటుందనే గుసగుసలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్నాయి.