Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చివరి షెడ్యూల్ షూటింగ్‌లో నాగ అన్వేష్ "ఏంజెల్"

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (20:27 IST)

Widgets Magazine
angel movie still

'మన్యంపులి' వంటి సూపర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాత 'సింధూర పువ్వు' కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్. సోషియోఫాంటసీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో నిర్మాతగా భువన్ సాగర్, దర్శకుడిగా 'బాహుబలి' పళని తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నారు. 
 
ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ఈ చిత్ర బృందం పూర్తి చేసుకొంది. తదుపరి షూటింగ్ ఫిబ్రవరి 14 నుంచి మొదలుకాబోతుంది. ఇక ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలుపోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. 
 
కళ్లు చెదిరే గ్రాఫిక్స్ హంగులతో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాహుబలి పళని సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ముగించి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టేందుకు ఏంజిల్ టీమ్ ప్లాన్ చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"ఎస్‌4"కు ఐదేళ్ళు పడుతుంది.. హీరో సూర్య

సింగం సిరీస్‌లో మూడు భాగాలు చేసి హ్యాట్రిక్‌ సాధించాను. నాలుగో భాగాన్ని ఎప్పుడు చేస్తారని ...

news

"కథలో రాజకుమారి" కోసం రఫ్ లుక్‌తో రోహిత్

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ...

news

'ఘాజీ' యూట్యూబ్ సినిమా.. అనుకోకుండా వెండితెరపై ఆవిష్కరించాం : సంకల్ప్ రెడ్డి

దర్శకునిగా తొలి చిత్రాన్ని ప్రేమకథతో కాకుండా యుద్ధ నేపథ్యంలోసాగే కథతో ముందుకు వచ్చిన ...

news

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు భామలు.. రాశిఖన్నా ఓకే.. కాజల్-తమన్నాలను కూడా సెలెక్ట్ చేశారా?

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా ...

Widgets Magazine