బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శనివారం, 28 మే 2016 (10:46 IST)

సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే జంటగా అనువంశీకత చిత్రం ప్రారంభం!

సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే జంటగా సంగీత దర్శకుడు రమేష్ ముక్కెర దర్శకుడిగా పరిచయమౌవుతూ తెరకెక్కిస్తున్న 'అనువంశీకత ' చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. కౌండిన్య మూవీస్ బ్యానర్ పై టి.దామోదర్ గౌడ్ నిర్మిస్తున్నారు.

హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి క్లాప్ నివ్వగా.. అసెంబ్లీ స్పీకర్ మదుసూధన చారీ స్విచ్చాన్ చేశారు. గౌరవ దర్శకత్వం వినోద్ కుమార్ వహించారు. వీరితో పాటు మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ , దర్శకనిర్మాత రామకృష్ణ గౌడ్ పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్ కు అభినందనలు తెలియజేశారు.
 
ఈ సందర్భంగా.. అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన టెక్నిషియన్స్, నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం శుభపరిణామం అన్నారు. సామాజిక కథాంశాన్ని ఇతి వృత్తంగా తీసుకోని సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలన్ని వినోదానికి మాత్రమే పరిమితమైపోయాయని.. సందేశాత్మక చిత్రాలు కరువైయ్యాయని.. ఈ చిత్రం ద్వారా సందేశాత్మక చిత్రాల నిర్మాణం పెరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా సమాజ హితాన్ని కోరే సినిమాలు ఆదరించాలని కోరారు.
 
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటువంటి మంచి చిత్రాలను ఆదరించాలని.. ఈ చిత్రం ద్వారా పరిచయమౌవుతున్న నటీనటులకు ,టెక్నిషియన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ది కోసం చిన్న సినిమాలకు, సందేశాత్మక చిత్రాలకు సబ్సిడి ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉందని.. ఈ చిత్రాన్ని కూడా ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు, సహాకారం అందిస్తామని తెలిపారు. 
 
శాసన మండలి చైర్మెన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. నిర్మాత దామోదర్ గౌడ్ కొత్త వారితో సినిమా తీయడం అభినందనీయమన్నారు. ఈ చిత్రకథ విన్నాను చాలా బాగుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్‌కు ఈ కథ కనెక్ట్ అవుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రభుత్వ సహాకారం ఉంటుందని అన్నారు. ఇటువంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని కోరారు. 
 
ఎంపి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జనరిక్ ప్రాబ్లమ్స్ ముఖ్య కథాంశంగా చేసుకుని ప్రజలకు ఓ మంచి మేసేజ్ ఇచ్చే ప్రయత్నం ఈచిత్రం ద్వారా చేయడం గోప్ప విషయం అన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌, అలాగే ఇక్కడున్న సినీపెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటిని పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. తెరవెనుక పనిచేసే టెక్నిషన్స్‌కు చిత్రపురి కాలనీ లో పక్కా ఇళ్లకు స్థలం కేటాయించామని, సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్మాతలు కొత్త టాలెంట్‌ను ప్రోత్సాహించాలని కోరారు. 
 
హీరో సంతోష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రంలో విలన్‌గా చేశాను. ఈ చిత్రం ద్వారా దర్శకనిర్మాతలు హీరోగా పరిచయం చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొత్తవాళ్లను, చిన్న సినిమాలను మీడియా ఎప్పుడు పోత్సాహిస్తుంది. మమ్ముల్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.. 
 
హీరోయిన్ నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ తెలిపారు. నిర్మాత టి.దామోదర్ గౌడ్ మాట్లాడుతూ : 20 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిద శాఖల్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మంచి కథ దొరకడంతో ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చానని అన్నారు...త్వరలో వరంగల్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.
 
దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ : మా చిత్రయూనిట్‌ను అశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. సంగీత దర్శకుడిగా 12 సినిమాలకు పైగా పనిచేశాను..ఈ చిత్ర కథ చెప్పగానే దామోదర్‌గారు నిర్మించేందుకు ముందుకొచ్చి దర్శకుడిగా అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, కామెడీ, సెంటిమెంట్, మెసేజ్ ఉంటాయని అన్నారు. మంచి బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నామని తెలిపారు. మిగతా టెక్నిషన్స్‌ను గురించి త్వరలో తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్‌, యాకూబ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 
 
నటీనటులు : సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే, జావీద్... ఆర్ట్ : విజయ్ కుమార్, మేకప్ :కుమార్, కాస్టూమ్స్:బాబు, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సహ నిర్మాత: యాకుబ్, నిర్మాత: టి.దామోదర్ గౌడ్, కథ, మాటలు, సంగీతం, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ ముక్కెర.