Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ వేధింపులు నేనూ ఎదుర్కొన్నా : అనుపమా పరమేశ్వరన్

సోమవారం, 30 అక్టోబరు 2017 (14:09 IST)

Widgets Magazine
anupama parameswaran

దక్షిణాది చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో అనుపమా పరమేశ్వరన్ ఒకరు. ఈమె కోలీవుడ్, టాలీవుడ్‌లలో రాణిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది. తాను కూడా చాలా సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. బస్సులో తను ఎదుర్కొన్న సంఘటనలను ఆమె వివరించారు. 
 
"జీవితంలో ప్రతి అమ్మాయి ఒక్కసారైనా.. తనకు తెలియకుండానే లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. బస్సులో కండక్టర్ మహిళను తాకి వెళ్లొచ్చు. కానీ బస్సులో ఉన్న రద్దీ వల్ల దానిని మనం గుర్తించలేం. నా లైఫ్‌లో కూడా చాలా సార్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. ఉదాహరణకు బస్సులో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్లినపుడు.. మాటలతో కూడా వేధిస్తూ ఉంటారు. తప్పుగా చూసినా కూడా అది వేధింపే. ఆ చూపులు మహిళలకు అర్థమవుతాయి. దయచేసి మగవారు అర్థం చేసుకోవాలన్నారు. 
 
మీకు కూడా తల్లి, సోదరి ఉంటారు కదా.. అలా చేయడం ఆడవారికి ఎంత బాధగా ఉంటుందో తెలుసుకోవాలి. వీకెండ్స్‌లో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లేదాన్ని.. నాలుగున్నరకు బస్ ఎక్కేదాన్ని. నాకు దాదాపు ఆరుగంటల ప్రయాణం. ఆ టైమ్‌లో బస్సులో లేడీస్ తక్కువ మంది ఉండేవారు. మగవారు దగ్గరకు వచ్చి నన్ను తాకేందుకు ప్రయత్నించేవారు. చాలా సార్లు దూరం జరగమంటూ హెచ్చరించేదాన్ని. ఎవరైనా అలా చేయడం చిరాకు తెప్పిస్తుంది. అలా చేయడంలో వారికి కలిగే ఆనందమేంటో తెలియదు. చాలా మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటారు" అంటూ పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీముఖి అందాలకు డైలాగులు తోడైతే.... గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ (వీడియో)

యాంకర్ కమ్ యాక్టర్‌గా మారిన శ్రీముఖి.. తాజాగా "గుడ్ బ్యాడ్ అగ్లీ'' అనే సినిమాలో ...

news

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే కదా.. సినిమాల్లోనూ అందుకే?: ఆండ్రియా

ఇంట్లో ముద్దులు పెట్టుకోవడం కామనే.. సినిమాల్లోనూ అదే చూపిస్తున్నాం. ప్రతి ఇంట్లో జరిగేదే ...

news

పన్ను చెల్లించని ప్రముఖ హీరోయిన్.. చర్య తప్పదా?

పలువురు సెలెబ్రిటీలు, హీరోహీరోయిన్లు విదేశాలను నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోవడం ...

news

శివబాలాజీ సతీమణి మధుమితకు తప్పని వేధింపులు.. సినీ పరిశ్రమకు చెందినవాడే?

తెలుగు బిగ్ బాస్ షో విజేత శివ బాలాజీ సతీమణి మధుమితకు వేధింపులు ఎదురయ్యాయి. పలు సినిమాలు, ...

Widgets Magazine