శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (11:07 IST)

ఆర్యతో ఎఫైర్ మామూలే.. రానాని బ్రదర్ అని పిలుస్తాను: అనుష్క

ప్రస్తుతం సింగం సిరీస్‌లో బాహుబలి హీరోయిన్ అనుష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. సింగం, సింగం2 ఇప్పటికే బిగ్ హిట్టైన సంగతి తెలిసిందే. ఇదే సిరీస్‌లో సింగం-3 కూడా తెరకెక్కుతోంది. సూర్య సరసన అనుష్క - శ్రుతిహాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎప్పటిలానే ఈ సినిమాలో అనుష్క ప్రధాన నాయిక. రెండో నాయికగా శ్రుతిహాసన్ అందాలు ఆరబోయడానికి రెడీ అవుతోంది. ఈ సంగతిని అనుష్క కూడా ధ్రువీకరించింది. 
 
ప్రస్తుతం సింగం ఫ్రాంచైజ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్నానని తేల్చేసింది. తమిళ హీరో ఆర్యతో ఎఫైర్ మాటేమిటి? అనే ప్రశ్నకు అనుష్క బదులిస్తూ.. ఇలాంటివన్నీ మామూలే. ఒక్క ఆర్యతోనే కాదు అందరు హీరోలతోనే లింకులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఒక్క రానాతో తప్ప. ఎందుకంటే రానాని బ్రదర్ అని పిలుస్తాను. తను నన్ను సిస్టర్ అని పిలుస్తాడు. అందువల్ల ఆగిపోయారేమో.. అంటూ అనుష్క చెప్పింది.