Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉయ్యాలవాడలో అనుష్క... చిరు సగం గట్టెక్కేసినట్లే మరి

హైదరాబాద్, గురువారం, 6 జులై 2017 (07:28 IST)

Widgets Magazine
Anushka

బాహుబలి 2 లో దేవసేన పాత్రలో ఒలికించిన ఆ రాజసం చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చరిత్రకు, ఫాంటసీకి సంబంధించిన ఏ సినిమా అయినా సరే యువరాణిగా, రాణిగా, రాజకుమారిగా ఆమె అయితేనే చూస్తాం అనేంత క్రేజీని సంపాదించుకుంది దేవసేన. ఆ క్రేజ్ అనుకోని భాగ్యం కాదు. పదేళ్లకుపైగా చిత్ర పరిశ్రమలో నలుగుతూ, రాపాడుతూ, మెరగొందుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్న విజయ దరహాసం ఆమె. ఆమే అందరూ మెచ్చుతున్న అనుష్క.
 
‘బాహుబలి’ తరువాత బాలీవుడ్‌లో కూడా అనుష్కకి ఎంత క్రేజ్ వచ్చేసిందంటే లెక్కలేనన్ని ఆఫర్లు ఆమె వెంటపడ్డాయి. కానీ అప్పటికే ఒప్పుకున్న భాగమతి తప్ప మరే చిత్రానికి ఆమె అంగీకారం తెలుపలేదు. ఇక తెలుగు, తమిళ్‌లో అనుష్కకి వున్న క్రేజ్ తెలిసిందే. ఇంత క్రేజ్ వుండి.. అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా వున్నా .. అనుష్క మాత్రం తన కొత్త ప్రాజెక్ట్ విషయంలో తొందరపడడం లేదు. 
 
అయితే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి అనుష్క ఓకే అనేసిందనేది లేటెస్ట్ టాక్. మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తెరకెక్కబోయే విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్న రామ్‌చరణ్ లీడ్ రోల్ కోసం ఆఫర్ ఇవ్వడంతో అనుష్క ఒప్పుకోవడం జరిగిపోయిందట. ఇక అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. చేయడమే మిగిలిందనేది ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ చేస్తోన్న ‘భాగమతి’ రిలీజ్‌కి రెడీ అవుతోంది.
 
తాజాగా అనుష్క ప్రభాస్ సరసన సాహో చిత్రంలో లీడ్ రోల్‌లో నటించడానికి అవకాశం దక్కించుకుందని వార్తలు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా లీడ్ రోల్ తనకే దక్కింది. సెలెక్టివ్‌గా అయినా సరే అనుష్క సరైన చిత్రాలనే ఎంచుకుంటోందని  అర్థమవుతోంది కదూ.
 
ఆలస్యంగా ఎంచుకున్నప్పటికీ అనుష్క ఎంపిక ద్వారా ఉయ్యాలవాడకు ఫేస్ వాల్యూ వచ్చేసినట్లే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సాహో హీరోయిన్ ప్రనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?

ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక ...

news

తాప్సికి మళ్లీ తెలుగు సినిమాలపై గాలి మళ్లింది... ఆనందో బ్రహ్మ

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు తెలుగు సినిమాల్లో మరోసారి ...

news

భరత్ ఇంటిలోనే పెద్దఖర్మ... రవితేజకి మళ్లీ చెడ్డ పేరు...

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆఖరి చూపు కూడా చూడలేదంటూ మీడియా నానా రచ్చ ...

news

స్పైడర్ కొత్త రికార్డు.. స్పైడర్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు ...

Widgets Magazine