శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (17:39 IST)

బాహుబలి హీరోయిన్ అనుష్క తల్లి కాబోతోంది..!

బాహుబలి హీరోయిన్ అనుష్క త్వరలో తల్లికాబోతుంది. ఇదేంటి అని షాకవుతున్నారా? కాస్త ఆగండి. సూర్య హీరోగా నటించే సింగం 3లో అనుష్క అమ్మగా కనిపించబోతోందని టాక్ వస్తోంది.

ఓ బిడ్డకు తల్లిగా అనుష్క సింగం 3లో కనిపించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సింగం 3 కథ ప్రకారం సూర్య, అనుష్క లవ్ బర్డ్స్‌గా కనిపిస్తారని.. అంతేగాకుండా భార్యాభర్తలుగా మాస్‌ను ఆకట్టుకునే రీతిలో వీరి నటన ఉంటుందని తెలిసింది. 
 
ఈ సినిమాలో గ్లామర్ తార శృతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే శృతిహాసన్‌ది సింగం 3లో నెగటివ్ రోల్ అని తెలుస్తోంది. అనిరుద్ సంగీతం సమకూర్చే సింగం 3లో సూర్య సీబీఐ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది.