శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (13:18 IST)

బన్నీ డైరీ చదివే.. రుద్రమదేవితో రొమాన్స్ చేశా: రానా కామెంట్

రానా-అల్లు అర్జున్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చెన్నై వీధుల్లో వీరిద్దరూ కలిసి తిరిగే వాళ్లని పలు సందర్భాల్లో చెప్పివున్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం రుద్రమదేవి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే రుద్రమదేవి ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. రానా అసలే రుద్రమదేవితో రొమాన్స్ చేసే చాళుక్య వీరభద్రుడిగా నటించాడు. మరి అందులో రొమాన్స్ పండించాలంటే ఎలా? అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే ఏమన్నాడో తెలుసా? బన్ని చిన్నప్పటి నుంచి పెళ్లయ్యే వరకు డైరీలో తన లవ్ లైఫ్ గురించి రాశాడు. 
 
అది తనకు ఇచ్చాడు. దాన్నుంచి బోలెడంత నేర్చుకున్నా. అందులోంచి ప్రిపేర్ అయి రుద్రమదేవితో లవ్ సీన్స్- రొమాన్స్ సీన్లు చేశానని రానా చెప్పాడు. అయితే దీనికి పక్కనే ఉన్న బన్ని ఏమని రిప్లయ్ ఇచ్చి ఉంటాడు? రానా నా డైరీ చదివాడు కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.. అంటూ పంచ్ వేశాడు. స్క్రీన్‌పై రొమాన్స్ చేయడంలో ఉన్న దూకుడు పెళ్లి చేసుకోవడంలో లేదని సినీ పండితులు అంటున్నారు. ప్రస్తుతం రుద్రమదేవి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ.. త్వరలోనే బెంగుళూరు డేస్ తమిళ రీమేక్‌తో రానా వచ్చేస్తున్నాడు.