గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మే 2016 (10:48 IST)

శరవేగంగా బాహుబలి 2 షూటింగ్: 2017 ఏప్రిల్‌లో రిలీజ్.. క్లైమాక్సే పెండింగ్!

బాహుబలి 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2017లో బాహుబలి 2 సినిమా రిలీజ్ కానున్నప్పటికీ.. జక్కన్న రాజమౌళి షూటింగ్ పనుల్ని చకచకా చేసేస్తున్నాడు. ఈ క్రమంలో కేవలం క్లైమాక్స్ మాత్రం మిగిలి వుందంటే, బాహబలి 2 షూటింగ్ ఎంత ఫాస్ట్‌గా జరుగుతుందో తెలిసిపోతుంది.  
 
''బాహుబలి: ది కంక్లూజన్'' షూటింగ్‌లో భాగంగా మే నెలంతా ఫారిన్ టూర్‌లతో రెస్టు తీసుకున్న జక్కన్న.. ఇప్పుడిక పనిలోకి దూకేశాడు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ కణల్ కణ్ణన్‌తో కలసి కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి చర్చిస్తున్నాడు. క్లైమాక్స్ స్క్రిప్ట్ పూర్తికావడంతో.. ఇక షాట్లను తెరకెక్కించే పనుల్లో రాజమౌళి బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ బాహుబలి 2 కోసం సిద్ధంగా ఉన్నాడు. 
 
రానా అండ్ అనుష్క ఒక్కరే షూటింగ్‌లో జాయిన్ కావల్సి ఉంది. మొత్తం షూటింగ్ పూర్తయ్యేందుకు దాదాపు అక్టోబర్ వరకు టైమ్ కావాల్సి వుంటుంది. ఇక బాహుబలి 2.. 2017 ఏప్రియల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.