శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 25 నవంబరు 2015 (11:31 IST)

ఔను... నేను కూడా గురయ్యా, అర్థం కాని ఏఆర్ రెహ్మాన్ వ్యాఖ్యలు, అమీర్‌ పైన జాలా...?

అమీర్ ఖాన్ తన భార్య ఇలా అన్నదంటూ తన భార్య మాటగా ఓ మాట చెప్పి దేశంలో పలువురి అసంతృప్తిని, ఆందోళనను ఎదుర్కొంటున్నాడు. ఇదిలావుంటే ఆస్కార్ గ్రహీత, సంగీత చక్రవర్తి ఏ.ఆర్. రెహ్మాన్ అసహనంపై వస్తున్న కామెంట్లపై ఇలా వ్యాఖ్యానించారు. 'మన దేశం చాలా అల్ట్రా సివిలైజ్డ్ సొసైటీ కనుక మనం ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. అసహనం గురించి చెప్పడానికీ ఏమీ లేదు. దానిని మనం అహింసాత్మక మార్గంలో, గాంధేయ మార్గంలో ఎదుర్కోవాలి. ఇలా కొట్టుకొని కామెంట్లు చేసుకోకూడదు' అని వ్యాఖ్యానించారు.
 
అమీర్ ఖాన్ చేసిన కామెంట్లను అందరూ విమర్శిస్తున్నారు కదా అని అడిగితే... అవును నేను కూడా గతంలో అలాంటివి ఎదుర్కొన్నా అని బదులిచ్చారు. ఇంతకీ రెహమాన్ ఎదుర్కొన్నది ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అసలు రెహమాన్ వ్యాఖ్యలు ఎలాంటి అర్థాన్ని ఇచ్చాయో తెలియడంలేదు. వీటిని ఎలా రాయాలబ్బా అని కొంతమంది జుట్టు పీక్కుంటున్నారట. కొన్నిసార్లు రెహ్మాన్ పాటలు చాలా ఫాస్ట్ బీట్ గా సాగుతూ అర్థంకాకుండా గందరగోళంగా ఉంటాయి. ఈ వ్యాఖ్యలు కూడా అదే రేంజ్ అని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద అమీర్ ఖాన్ పైన రెహ్మాన్ జాలి చూపిస్తున్నట్లున్నారు...!!