మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (18:24 IST)

''నిర్మల కాన్వెంట్''లో ఏఆర్ రెహ్మాన్ సన్ అమీన్ పాట.. నిర్మాతగా సోగ్గాడు!

శ్రీకాంత్ తన కుమారుడు రోషన్ హీరోగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మాంచి పేరున్న సెలెబ్రిటీలకు లింకుంది. టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తన కుమారుడిని ''నిర్మల కాన్వెంట్'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జి. నాగ కోటేశ్వరరావు తెరకెక్కిస్తుండగా, అక్కినేని నాగార్జున నిర్మిస్తుండటం విశేషం. 
 
ఇంకో విశేషం ఏమిటంటే..? ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతమందిస్తుండగా, స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ తనయుడు అమీన్ ఇందులో ఓ పాట పాడారు. ఏఆర్ రెహ్మన్ తనయుడు అమీన్ నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా తొలిసారి గాయకుడిగా పరిచయం కానున్నాడు.

అమీన్ పాడిన పాటను ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఇకపోతే.. జై చిరంజీవ, రోబో, దూకుడు వంటి సినిమాలలో బాలనటిగా నటించిన శ్రేయా శర్మ నిర్మలా కాన్వెంట్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.