గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (15:07 IST)

"బాహుబలి 2"కు వ్యతిరేకంగా ఆందోళన.. 'కటిక చీకటి' అనే పదం కించపరిచేలా ఉందట...

'బాహుబలి 2' చిత్రానికి వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన జరిగింది. అదీ కూడా ఓ వర్గానికి చెందిన నేతలు... ఈ చిత్రంలో వాడిన ఒక్క పదం తమ కులాన్ని కించపరిచేలా ప‌లు సీన్లు ఉన్నాయ‌ని, వాటిని తొలగి

'బాహుబలి 2' చిత్రానికి వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన జరిగింది. అదీ కూడా ఓ వర్గానికి చెందిన నేతలు... ఈ చిత్రంలో వాడిన ఒక్క పదం తమ కులాన్ని కించపరిచేలా ప‌లు సీన్లు ఉన్నాయ‌ని, వాటిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు ఆఫీసు ఎదుట ఆరెకటిక సంఘాలు భారీ ధర్నాకు దిగాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ చిత్రంలో కట్టప్ప, మహేంద్ర బాహుబలిల మధ్య జరిగే సంభాషణల్లో 'కటిక చీకటి' అనే పదాన్ని పలుకుతారు. ఈ పదం 'ఆరె కటిక'ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంద‌ని వారు అంటున్నారు. సెన్సార్‌ బోర్డు కూడా ఈ పదానికి అనుమతినివ్వడమేంట‌ని వారు నీల‌దీస్తున్నారు.
 
ఈ సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కూడా వారు న‌గ‌రంలోని బంజారా హిల్స్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌దాన్ని తొల‌గించ‌క‌పోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన ఉద్ధృతం చేస్తామ‌ని అన్నారు.