Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వైరల్‌గా మారిన "అర్జున్ రెడ్డి" లిప్‌లాక్ మేకింగ్ వీడియో

బుధవారం, 23 ఆగస్టు 2017 (12:50 IST)

Widgets Magazine

'పెళ్లిచూపులు' ఫేమ్ విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్ ఇప్పటికే విమర్శలు వచ్చాయి. 
 
అసభ్యకరమైన పోస్టర్‌ను చిత్రీకరించిన 'అర్జున్ రెడ్డి' చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లపై తగిన చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నగర పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. 
 
దీంతో ఈ చిత్రం విడుదలకు ముందే కావాల్సినంత ప్రచారం సొంతం చేసుకుంది. ముఖ్యంగా, సినిమాలోని లిప్‌లాక్ ముద్దుల దృశ్యాల పోస్టర్లపై సంచలన వ్యాఖ్యలు, రాంగోపాల్ వర్మ ట్వీట్ల సందడి, వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఈ సినిమాకు ఇప్పటికే అద్భుతమైన ప్రచారం వచ్చింది.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని లిప్ లాక్‌లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు. మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 
అయితే, ఈ చిత్రంలోని ముద్దు సీన్లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరూ చూడండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సముద్రతీరంలో దిశా పటానీ అందాలు చూడతరమా? (Video)

హాలీవుడ్ నటుడు జాకీచాన్‌కు డాన్సు నేర్పిన హీరోయిన్‌గా, 'ఎంఎస్ ధోనీ : ద అన్‌టోల్డ్ స్టోరీ' ...

news

చిరంజీవి "సైరా" టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెహ్మాన్‌ది కాదట...

మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ ...

news

చుంకీపాండేకు ఇంత అందమైన కూతురా.. డీఎన్ఏ టెస్ట్ చేయాలి : ఫరాఖాన్

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కుమార్తె అనన్య పాండేపై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ ...

news

''అర్జున్ రెడ్డి'' పోస్టర్లో తప్పుందా అని మీ మనవళ్లు, మనవారాళ్లను అడగండి!

పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''అర్జున్ రెడ్డి'' వివాదాల చుట్టూ ...

Widgets Magazine