గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (16:23 IST)

అసిన్ ఇంట పెళ్లి సందడి: విదేశాల్లో షాపింగ్.. పెళ్లి ఎప్పుడో..?

అసిన్ ఇంట పెళ్లి సందడి అప్పుడే మొదలైంది. తన వివాహ వేడుక కోసం లండన్, ప్యారిస్, న్యూయార్క్‌లో అసిన్ షాపింగ్ చేస్తోంది. అయితే పెళ్లి డేట్ మాత్రం ఇంకా అసిన్ ప్రకటించలేదు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో పదో స్థానంలో ఉన్న మైక్రోమాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మను అసిన్ త్వరలో పెళ్లాడనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నా.. అవకాశాలు రాకపోవడంతో పాటు దక్షిణాదిన కూడా సినీ ఛాన్సులు కనుమరుగవడంతో ఇక అసిన్ పెళ్లి చేసుకోవాలని డిసైడైపోయింది. 
 
అందుకే అక్షయ్ కుమార్ ద్వారా పరిచయమైన రాహుల్ శర్మతో ప్రేమాయణానికి త్వరలో ఫుల్ స్టాప్ పెట్టి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందుకోసం పెళ్లి పనులు చకచక జరిగిపోతున్నాయి. కానీ పెళ్లి డేట్‌ను మాత్రం అసిన్-రాహుల్ శర్మ జోడీ ఇంకా ప్రకటించలేదు. కాగా.. తెలుగులో ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘లక్ష్మీనరసింహ’, ‘ఘర్షణ’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన అసిన్, బ్లాక్‌బస్టర్ హిట్ ‘గజినీ’ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది.