గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (12:47 IST)

సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ నివాసంలో రూ.2.25 లక్షలు చోరీ

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ నివాసంలో చోరీ జరిగింది. ముంబయిలోని బాంద్రాలో అర్పితా ఖాన్‌ నివాసముంటున్న పసిఫిక్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఇంట్లో ఉన్న రూ. 2.25 లక్షల నగదు, బంగారు నా

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ నివాసంలో చోరీ జరిగింది. ముంబైలోని బాంద్రాలో అర్పితా ఖాన్‌ నివాసముంటున్న పసిఫిక్‌ హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఇంట్లో ఉన్న రూ.2.25 లక్షల నగదు, బంగారు నాణెం, ఖరీదైన బట్టలతో పాటు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అపహరణకు గురికావడంతో అర్పిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
విహారయాత్ర నుంచి ఆదివారం తిరిగివచ్చిన అర్పితాఖాన్ దంపతులు ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్పితాఖాన్ ఇంట్లో పనిచేసే ఆఫ్సా అనే పనిమనిషి మీదనే తమకు అనుమానం ఉందని, గత నెల 30వతేదీ నుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. అర్పిత కుటుంబం విదేశాలకు వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా పరారీలో ఉన్న ఆఫ్సా కోసం పోలీసులు గాలిస్తున్నారు.