శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 13 జనవరి 2016 (12:33 IST)

'నాన్నకు ప్రేమతో' థియేటర్ పైన రాళ్లతో దాడి... ఏం జరిగింది...?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో... చిత్రం బుధవారం నాడు విడుదలైంది. ఐతే నాన్నకు ప్రేమతో.. విడుదలైన ఓ థియేటర్ వద్ద అనుకోని సంఘటన ఒకటి జరిగింది. బెజవాడలోని యువరాజ్ థియేటర్ వద్ద సినీ అభిమానులు టిక్కెట్ల కోసం తోపులాటకు దిగారు. 
 
తమకు టిక్కెట్లు లభించకపోయేసరికి థియేటర్ యాజమాన్యం సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. ఈ ఉద్రక్తితత ఇలా కొనసాగుతుండగానే కొంతమంది గుర్తు తెలియని యువకులు థియేటర్ పైన రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పగిలాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.