Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవసరాలా...? నీకిది అవసరమా...? బాబు బాగా బిజీ... ఈ రకంగానా...?

గురువారం, 4 మే 2017 (17:03 IST)

Widgets Magazine

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ నుండి స్క్రీన్ రైటింగ్‌లో డిప్లొమా... న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో సంవత్సరం కోర్సు వంటి పలు ఘనత వహించిన కోర్సులు చేసి, తన పేరు కనిపిస్తే .. హాయిగా నవ్వుకోవచ్చు అని ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లలో అడుగుపెట్టేంతలా నటుడిగా, దర్శకుడిగా పేరు సంపాదించుకుని ఇప్పుడేమో 'బాబూ బాగా బిజీ' అంటూ ఊర అడల్ట్ కంటెంట్‌తో హడలెత్తిస్తున్నాడు శ్రీనివాస్ అవసరాల. 
avasaral in BBB
 
హంటర్ అనే హిందీ సినిమాకు అనువాదంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్ర దర్శకుడు నవీన్. అవసరాల సరసన శ్రీముఖి, మిష్టి చక్రవర్తి, తేజస్వి, సుప్రియలు నటిస్తున్న ఈ చిత్రంలో ద్వందార్థాలకు, శృంగార సన్నివేశాలకు కొదవ లేదని ఇప్పటికే విడుదలైన టీజర్లతో తేలిపోయింది. హీరోయిన్లను ఘాటుగా, మోటుగా వాడేసిన ఈ సినిమా వెనుకటి షకీలా సినిమాలను జ్ఞాపకం చేస్తోందంటున్నారు టీజర్లు, ఫస్ట్ లుక్‌లు చూసిన సినీ ప్రియులు. 
 
గాఢమైన అధర చుంబనాలు, లోదుస్తుల్లో గ్లామర్ ఒలకబోయడాలు, అనాచ్ఛాదిత వీపుని కెమెరా కంటికి అప్పగించేయడాలు, చీరను పైకెత్తే సన్నివేశాలతో పాటు పువ్వుని ఒలిచిన అరటిపండు ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటి సీన్లతో ఫక్తు సి గ్రేడ్ సినిమాలా అనిపిస్తున్న ఈ బాబు బాగా బిజీ చిత్రం సెన్సార్‌ను సైతం పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జయాపజయాలపై ఆధారపడి, మరిన్ని హాలీవుడ్, బాలీవుడ్ తరహా అడల్ట్ సినిమాలు మరిన్ని తెలుగు వెండితెరపై వస్తాయేమో చూడాలి మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రభాస్‌ పెళ్లిని అడ్డుకున్న రాజమౌళి... జక్కన్న స్వార్థం... 'బాహుబలి'ని కట్టిపడేసిందట.. నిజమేనా?

ప్రభాస్... టాలీవుడ్ స్టార్ కాదు.. జాతీయ స్టార్. అదీకాదు.. ఇంటర్నేషనల్ స్టార్. 'బాహుబలి' ...

news

చైతూకు కానుకగా కారు- బాహుబలి-2ని చూడకుండా బయటికొచ్చేసిన సమంత? ఎందుకు?

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత-నాగచైతన్యలు త్వరలో దంపతులు కానున్నారు. సమంతకు సామాజిక సేవ ...

news

టీవీల్లో సినిమా వస్తుందంటే పిల్లల కళ్లు మూయాల్సిన పరిస్థితి...

కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లుంది మన టాలీవుడ్‌లో ప్రస్తుత కథానాయిక ...

news

అడల్ట్ సినిమాల్లో నటిస్తే ''చీప్'' అనే ముద్ర ఎందుకు వేయాలి? బాబు బాగా బిజీపై అవసరాల

బాహుబలి-2 సినిమాతో పోటీపడేందుకు ''బాబు బాగా బిజీ'' శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇదో అడల్ట్ ...

Widgets Magazine