Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాని హీరో అవుతాడని ఆమె చెప్పారట.. ''అ''లో కాజల్ లుక్ ఇదే..

సోమవారం, 1 జనవరి 2018 (09:22 IST)

Widgets Magazine

ఎంసీఏ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని నటుడు అవుతాడని చెప్పింది ఎవరో తెలుసా? నటి స్నేహ తల్లి. ఈ విషయాన్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినీ రంగంలో కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిని ప్రారంభించానని, బాపు దర్శకత్వంలో వచ్చిన "రాధాగోపాళం" సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని వెల్లడించారు. ఆ సమయంలోనే స్నేహ తల్లి తనను చూసి నటుడు అవుతానని చెప్పారని నాని తెలిపారు. అయితే ఆవిడ సరదాగా అంటున్నారని అనుకునేవాడినని, ఆ తర్వాత నిజంగానే తాను నటుడిని అయ్యానని చెప్పాడు. 
 
బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తాను చేరినప్పుడు, తనకేమీ తెలియదని, ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకుని.. ఈ స్థాయికి ఎదిగానని నాని తెలిపారు. అలాంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేసే అవకాశం తనకు మొట్టమొదట్లోనే లభించడం మరువలేని విషయమని నాటి విషయాలను నాని గుర్తుచేసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. నాని నిర్మాతగా అవతారమెత్తనున్న సంగతి తెలిసిందే. 'అ' అనే చిత్రం నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తున్న నాని ఇందులో నటిస్తున్న ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
ఈ చిత్రంలో రవితేజ చెట్టు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. హీరో నాని చేప పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇందులో ఇంకా నిత్యా మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల కూడా నటిస్తున్నారు. త్వరలో వీరి పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల కానుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. కొత్త సంవత్సరం సందర్భంగా నానికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అజ్ఞాతవాసి #KodakaaKoteswarRaoSong మీ కోసం.. (వీడియో)

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా "అజ్ఞాతవాసి"జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ...

news

26 సీన్స్ కట్ చేయమని చెప్పలేదు.. పద్మావతి ఇక పద్మావత్: సీబీఎఫ్‌సీ

వివాదాస్పద బాలీవుడ్‌ చిత్రం ‘పద్మావతి’ సినిమాకు కేంద్ర సినిమా సెన్సార్‌ బోర్డు యూ అండ్ ఏ ...

news

కన్నడ హీరో ఎంత పనిచేశాడు.. కూల్‌డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి.. రేప్..

కన్నడ హీరోపై అత్యాచారం కేసు నమోదైంది. "హోంబణ్ణ'' సినిమా హీరో సుబ్రహ్మణ్య తనపై ...

news

విలన్‌గా జబర్దస్త్ ఛమ్మక్ చంద్ర - ట్రైలర్ చూడండి

''జబర్దస్త్'' నటులకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జబర్దస్త్ నటులు ...

Widgets Magazine