Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2కి అమెరికా నీరాజనం: 800 థియేటర్లలో విడుదల.. ఆల్ టైమ్ రికార్డ్

హైదరాబాద్, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:17 IST)

Widgets Magazine

అమెరికాలో బాహుబలి-2కి  కనీ వినీ ఎరుగని స్పందన ఉన్నట్లు అందరికీ తెలిసిందే. అయితే ప్రేక్షకులనుంచి మాత్రమే కాదు. పంపిణీ వర్గాలలో ఈ చిత్రానికి ఏర్పడ్డ క్రేజి ఆంతా ఇంతా కాదని తాజా సమాచారం. ఇంతవరకు అమెరికాలో తెలుగు సినిమా ఎక్కువగా 250 థియేటర్లలో మాత్రమే విడుదల అయినట్లు రికార్డయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా విడుదల విషయంలో ఇదే అత్యధికమట.
<a class=baahubali 2 still" class="imgCont" height="253" src="http://media.webdunia.com/_media/te/img/hp/home-page/2017-03/16/full/1489650372-6615.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />


కానీ బాహుబలి 2 సినిమా అమెరికాలో ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందో తెలిస్తే మన గుండె ఆగిపోతుందంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమాల విడుదల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో 800 పైగా థియేటర్లలో విడుదల కానుంది. తమిళ, హిందీ, తెలుగు వెర్షన్లు కలిపి ఇన్ని థియేటర్లలో విడుదల అవుతోందని సమాచారం.

ఇంత అధిక సంఖ్యలో విడుదల కావడం, ప్రీమియర్ రేట్లు 30 డాలర్లు కావడం (రెగ్యులర్ సినిమా టి్క్కెట్ 20 డాలర్లట)తో వారాంతంలోనే భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను బాహుబలి-2 సొంతం చేసుకోనుందని పంపిణీ వర్గాల భోగట్టా. 
 
అమెరికాలో అమీర్ ఖాన్ సినిమా దంగల్ మాత్రమే ఇంతవరకు మొత్తంమీద 12 మిలియన్ డాలర్ల వసూళ్లతో అమెరికాలో అగ్రస్థానంలో ఉంది. కానీ తొలి వారాంతంలోనే బాహుబలి-2  అంతకు మించి వసూలు చేయనుందని అంచనాలు వేస్తున్నారు. ఇక మొత్తం కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో పాఠకులు, అభిమానులకే ఎరుక.

మరో రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న బాహుబలి2 క్రేజీ ఇప్పుడే మొదలైపోయిన నేపథ్యంలో ఈ చిత్రం గురించిన అంచనాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో ప్రభాస్ అందరికీ డార్లింగ్... నాకు మాత్రం అలా కాదు : తమన్నా

హీరో ప్రభాస్‌పై హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్‌లో ప్రతి ఒక్కరూ ...

news

నా బెస్ట్ డైరక్టర్ రాజమౌళి కాదు.. పెళ్లిపై స్వీటీ చెప్పిందే నా మాట : బాహుబలి హీరో ప్రభాస్

తన పెళ్లిపై జరుగుతున్న దుష్ప్రచారానికి 'బాహుబలి' ప్రభాస్ స్పందించారు. బాహుబలి-2 తమిళ ...

news

వీళ్లిద్దరూ మహాముదుర్లు.. ప్రేమ కాదు సహజీవనమేనట

మరో దక్షిణాది జంట ప్రేమ నుంచి సహజీవనం వరకు వెళ్లిపోయినట్లే అని రూఢి అవుతోంది. ఎవరి ...

news

అలాంటి పిచ్చోళ్లు ఉంటేనే బాహుబలి సాధ్యం: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన రాజమౌళి

ప్రభాస్ వంటి నిబద్ధ నటుడు లేకపోతే బాహుబలి సినిమాయే లేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి ...

Widgets Magazine