Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి 2: విడుదలకు ముందే రికార్డ్.. రూ.500 కోట్ల బిజినెస్ అయ్యిందట..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:18 IST)

Widgets Magazine

ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. బాహుబలికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బాహుబలి 2 బిజినెస్‌ అమాంతం పెరిగిపోతోంది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి 2' చిత్రం విడుదలకు ముందే రికార్డు సృష్టించింది. ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 500 కోట్ల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. 
 
కేవలం డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ సినిమా రూ.500 రాబట్టినట్లు ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాల ట్వీట్ చేశారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'బాహుబలి 2' చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. 'బాహుబలి'కి కొనసాగింపుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. బాహుబలి ద  బిగినింగ్ సినిమా దాదాపు రూ.180కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లు వసూలు చేసిన భారతీయ సినిమాలోనే రికార్డులతో చరిత్ర సృష్టించింది. తద్వారా 2015లో భారత్‌లో అత్యధికంగా కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'బాహుబలి 2' (ద ఎండింగ్) ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాన్నకు చైతూ-సమ్మూ ప్రేమ అప్పుడే తెలిసిపోయిందేమో.. వాళ్ళ పెళ్ళి వాళ్ల ఇష్టమే: నాగ్

'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర ...

news

అల్లు అర్జున్ కోసం ఎగబడ్డ హైదరాబాద్ అమ్మాయిలు... బన్నీ సీరియస్‌, కానీ ఒకమ్మాయి పెట్టేసిందట...

నటుడు అల్లు అర్జున్‌ తనతో నటిస్తున్న కొందరి అమ్మాయిలపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. ...

news

'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శనిర్మాత ఇళ్లపై ఐటీ దాడులు.. బాలకృష్ణకు మినహాయింపు

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం దర్శక నిర్మాతలు, పంపిణీదారుల ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ ...

news

హాస్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ 'అత్తిలి' లెక్చరర్... నేడు 61వ బర్త్‌డే

వెండితెరపై హాస్య సన్నివేశాలు రావాల్సిన అవసరం లేదు.. జోకులు పేలనవసరం లేదు.. అసలు మనిషి ...

Widgets Magazine