Widgets Magazine Widgets Magazine

అపూర్వం... అనితర సాధ్యం.. బాహుబలి-2 సినిమా..1050 సెంటర్లలో 50 రోజులు

హైదరాబాద్, శుక్రవారం, 16 జూన్ 2017 (09:31 IST)

Widgets Magazine

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక చిరస్మరణీయ ఘట్టం.  గత 85 సంవత్సరాల దేశీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఘటనను నేటితో బాహుబలి-2 నమోదు చేసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా 9,500 థియేటర్లలో విడుదలై అన్ని రికార్డులను బద్దలు గొట్టిన  విడుదలై ఈ శుక్రవారంతో 50 రోజులైంది. ఇప్పటికే రికార్డులు మీద రికార్డులు సాధించిన ఈ చిత్రరాజం మరో ఘనత సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 1050 సెంటర్లలో ఇంకా ‘బాహుబలి 2’  సినిమా ప్రదర్శితమవుతోంది. ఏ భారతీయ సినిమా రంగమైనా ఊహించడానికి వీలులేని రికార్డు ఇది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.
baahubali
 
భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచిన ‘బాహుబలి 2’  మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టించనుంది. 50 రోజులు గడిచినా ఈ సినిమాకు ఆదరణ తగ్గకపోవడం విశేషం. త్వరలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో ఆల్‌టైమ్‌ రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రూ. 2 వేల కోట్లు సాధించే తొలి భారతీయ సినిమా అవుతుందని భావిస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు రూ. 1650 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్ల రూపాయల కలెక్షన్ చేరువలో ఉన్న బాహుబలి 2 సినిమా ఒక్క హిందీ ప్రాంతంలోనే 510 కోట్లు ఆర్జించి అత్యద్భుత రికార్డు సృష్టించింది. 
 
కాగా, ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనుండటం విశేషం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నానుంచి లేట్ కానివ్వను.. మీరే స్పీడ్ పెంచండి.. కాబోయే పెళ్లికూతురు అభ్యర్థన

ఏం మాయ చేశావే అని నాగచైతన్యతో తొలి సినిమాలో అనిపించుకుని చివరకి అతడినే మాయ చేసి ఒడిలో ...

news

మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రారంభ చిత్రంగా బాహుబలి 2

భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన, నేటికీ సాగిస్తున్న బాహుబలి 2 ...

news

ఆప్త ఆధ్వ‌ర్యంలో మెగా బ్లడ్ డ్రైవ్-2017

మెగాస్టార్ చిరంజీవి 40 సంవత్సరాల సినిమా సేవలను కొనియాడుతూ చిరంజీవి రక్తదాన సేవలకు ...

news

మా హనీమూన్ ఎక్కడంటే : నోరు విప్పిన హీరోయిన్ సమంత

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత త్వరలోనే హీరో అక్కినేని నాగార్జున కోడలుకానుంది. ఈ టాలీవుడ్ ...