శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 మార్చి 2017 (00:34 IST)

బాహుబలి 2 ప్రి-రిలీజ్ హైలెట్స్... రాజమౌళి స్పీల్‌బర్గ్... ప్రధాని మోదీ కట్టప్ప

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 మూవీకి మరో నెల రోజుల సమయం వుంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు హైదరాబాదులోని రామోజీ ఫిలిమ్ సిటీలో ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి 2 మూవీకి మరో నెల రోజుల సమయం వుంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు హైదరాబాదులోని రామోజీ ఫిలిమ్ సిటీలో ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి హైలెట్స్...
 
* బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు
 
* కార్యక్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ... బాహుబలి చిత్ర నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఇద్దరూ నాగిరెడ్డి-చక్రపాణి జోడీలా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షించారు.
 
* ఇక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ... రాజమౌళిని హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కేమరూన్‌తో పోల్చారు. ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడు అని అన్నారు.
 
* ఈ చిత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకూ చిత్రంలోని ప్రతి టీమ్ సభ్యులు సేమ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసారని రమ్యకృష్ణ అన్నారు.
 
* తనను అంతా ఇపుడు సత్యరాజ్ అని కాకుండా కట్టప్ప అని పిలుస్తున్నారని, అది తనకెంతో గర్వంగా వుందని నటుడు సత్యరాజ్ అన్నారు.
 
* జీవితంలో ఒక్కసారే కొన్ని అవకాశాలు వస్తాయనీ, అలాంటి అవకాశమే తనకు బాహుబలి చిత్రం ద్వారా దక్కిందని మిల్కీ బ్యూటీ తమన్నా అన్నారు.
 
* రాజమౌళిని హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌తో పోల్చారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈమధ్యనే ప్రధానమంత్రి మోదీ తను కుర్చీని కాపాడుతున్న కట్టప్పలాంటి వాడినంటూ బాహుబలి చిత్రంలోని పాత్రను చెప్పడాన్ని గుర్తు చేసుకున్నారు. ఐతే తను కట్టప్ప కాదనీ, దేశాన్ని రారాజులా పాలిస్తున్న బాహుబలి అని చెప్పానన్నారు.
 
* కీరవాణి సహకారంతోపాటు తన కుటుంబ సభ్యుల సహకారంతో రాజమౌళి మరిన్ని గొప్ప చిత్రాలను చేయాలని కె.రాఘవేంద్ర రావు ఆకాంక్షించారు. 
 
* బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ... ఇంత అద్భుత చిత్రానికి సంబంధించి తను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు గర్వంగా వుందన్నారు. బాహుబలి చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోని ముఘల్-ఇ-అజామ్ చిత్రం వంటిదవుతుందన్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రాన్ని విడుదల చేయడం తనకు ఎంతో సంతోషంగా వుందన్నారు.
 
* రానా మాట్లాడుతూ... తన కెరీర్లో ప్రభాస్ తన గొప్ప సహనటుడుగా వుంటాడని అన్నారు.
 
* దర్శకుడు రాజమౌళి చిత్రంలోని ప్రతి టెక్నీషియన్ కి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసారు. 
 
* చివరిగా ప్రభాస్ మాట్లాడుతూ... అందరికీ థ్యాంక్స్ చెపుతూ, బాహుబలిలోని ఓ డైలాగ్ చెప్పారు. వాడిది తప్పు అని తేలింది... తల తెగింది అంటూ చెప్పి ముగించారు.