శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (13:05 IST)

బాహుబలి సీక్వెల్‌ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు: డిసెంబర్ 31, 2016 ఫిక్స్

బాహుబలి సీక్వెల్‌ రిలీజ్‌కు జక్కన్న ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2016లో బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అవుతుందని ముందే చెప్పాడు రాజమౌళి. అయితే.. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్న తీరు చూసి.. చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా యూనిట్ నుంచి ఓ లీక్ వచ్చింది. బాహుబలి కచ్చితంగా వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుందని దాని సారాంశం. అయితే.. డిసెంబర్ 31 2016న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యారట.
 
బాహుబలి మొదటి భాగం విషయంలోనూ రిలీజ్ ఆలస్యం జరిగింది. దీనికి సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పిన దర్శకధీరుడు.. ఈసారి మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడట. ముందుగా అనుకున్న ప్రకారం 2016లోనే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట రాజమౌళి. అయితే.. బాహుబలి తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో.. వాటిని అందుకునేలా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకే ఇంత టైం నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.