Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తా.. త్వరలోనే కలిసి పనిచేస్తాం : 'బాహుబలి' స్టోరీ రైటర్

శుక్రవారం, 12 మే 2017 (13:41 IST)

Widgets Magazine
vijayendraprasad

హీరో పవన్ కళ్యాణ్‌పై 'బాహుబలి' కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రపంసల వర్షం కురిపించారు. పవన్‌ నిజాయితీ తనకు నచ్చిందన్నారు. అందువల్ల ఆయనతో కలిసి పని అవకాశం త్వరలోనే రావొచ్చునంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకనీరాజనాలు అందుకుంటున్న చిత్రం 'బాహుబలి 2'. ఈ చిత్రంలోని విశ్రాంతికి ముందు వచ్చే ఓ సన్నివేశానికి హీరో పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అంటూ విజయేంద్ర ప్రసాద్ సెలవించారు. 
 
ఈనేపథ్యంలో వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని అభిమానులందరూ చర్చించుకుంటున్నారు. ఈ ప్రశ్న తాజాగా విజయేంద్రప్రసాద్‌కు ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ 'పవన్‌తో కలిసి పనిచేయడం నాకిష్టమే. ఆయన కోసం నేను కథ రాస్తా. బహుశా.. తొందర్లోనే పవన్‌తో కలిసి పనిచేస్తానేమోన'ని అని వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే రూ.1000 కోట్ల వసూళ్ళను అధికమించిన బాహుబలి చిత్రం విజయేంద్రప్రసాద్‌‌కు ఎక్కడలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. తర్వాత మరో భారీ బడ్జెట్‌ సినిమాకు కథ అందించే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కంగన ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ సినిమాకు ఆయన స్టోరీ సిద్ధం చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జనసేనలోకి 'భీమవరం కుర్రోడు' సునీల్...

భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ...

news

ప్రభాస్ లేకుండా రాజమౌళి భారీ చిత్రమా... సాధ్యమేనా?

మీడియాలో రిపోర్టులను బట్టి చూస్తే స్వల్ప విరామంలో ఉన్న రాజమౌళి మరో భారీ ప్రాజెక్టుకు ...

news

దుబాయ్‌లో బాహుబలి2 ప్రదర్శన రద్దు.. పంపిణీదారులతో నిర్మాతలకు విభేదాలు

దుబాయ్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతున్న బాహుబలి-2కు అనుకోని అవాంతరం ఎదురైంది. ...

news

నయనకు ఏమైంది? అందరితో సై అంటోందే.. ఆమెనలా మార్చిందెవరు?

ఇప్పటికే ప్రేమ విషయంలో రెండు సార్లు ఓడిపోయిన నయనతార సుదీర్ఘ విరామం తర్వాత తన పాత ...

Widgets Magazine