మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (12:25 IST)

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఈనెల 5న గుడ్‌న్యూస్‌.. పెళ్లి వార్త కాదు... రాజమౌళి కామెంట్స్

''బాహుబలి-2కు సంబంధించిన రకరకాల విషయాలు ఈనెలలోనే విడుదలవుతాయి. బాహుబలి సీరీస్‌ యామెజాన్‌ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజర్‌ అక్టోబర్‌ 1న విడుదలవుతుంది. 5న ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్తున్నా

''బాహుబలి-2కు సంబంధించిన రకరకాల విషయాలు ఈనెలలోనే విడుదలవుతాయి. బాహుబలి సీరీస్‌ యామెజాన్‌ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజర్‌ అక్టోబర్‌ 1న విడుదలవుతుంది. 5న ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్తున్నాం. అది పెళ్లి గురించి కాదు. ఈ సినిమా పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోడని నేనలేదు. తనే అన్నాడు.'' అని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. తొలిసారిగా 'బాహుబలి-2' సినిమా గురించి ప్రెస్‌మీట్‌ పెట్టారు. సాయంత్రం 6.30 గంటలకు రావాల్సిన టీమ్‌.. 9 గంటలకు వచ్చింది. దాంతో.. షూటింగ్‌ ముగించుకుని వచ్చేసరికి లేట్‌ అయిందని.. రాజమౌళి వివరణ ఇచ్చాడు. శుక్రవారం రాత్రి మాదాపూర్‌ దస్‌పల్లా హోటల్‌లో జరిగింది. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 5న తన అభిమానులకే కాదు మొత్తం సౌత్‌ ఇండియాకే గర్వంగా వుండే వార్త. దాని తర్వాత ఇంకా చాలా జరగనున్నాయి. బాహుబలిని ఒక మహావృక్షంగా తీసుకుంటే టీవీ సీరీస్‌, కామిక్స్‌, బుక్స్‌, గేమ్స్‌ అన్నీ హయ్యస్ట్‌ బడ్జెట్‌తో తీస్తున్నాం. బాహుబల్ వర్చువల్‌ రియాలిటీ ఎక్స్పీరియన్స్‌ అనేది అందరూ ఎక్సైట్‌ అయ్యేది. ఇది ప్రపంచంలో అందరూ ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియన్ప్‌ చేస్తున్న విషయం. మేం ఈ సినిమాతో చేయడానికి ట్రై చేస్తున్నాం. మాహిష్మతి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీస్‌లో ఎక్స్‌‌పీరియన్స్‌ చేయగలిగితే అది వర్చువల్‌ రియాలిటీ. 2డి తెరమీద బొమ్మ చూస్తున్నట్టు కాకుండా మాహిష్మతి ప్రపంచంలోకి వెళ్లి అక్కడ జరగుతున్న కథని అక్కడివారితో కలిసి చూస్తున్నవారిగా అనుభూతిని కలిగించడమే మా ప్రయత్నం. 
 
360 ఫోటోస్‌ అనో, వీడియోస్‌ అనో ఫోన్‌లో చూసుకుంటే కెమెరా తిప్పుతుంటే 360 డిగ్రీస్‌లో అన్నీ కనిపిస్తాయి. దానికన్నా కాస్త ఎహెడ్‌గా వెళ్తే గూగుల్‌ కార్డ్‌ బోర్డ్‌ లో ఫోన్‌ పెట్టుకుని చూసినా కనిపిస్తుంది. శామ్‌సంగ్‌ గేర్‌వియర్‌ని పెట్టుకుని చూస్తే వర్చువల్‌ ప్రపంచాన్ని చూడొచ్చు. ఏ ఫోన్‌ ఉంటే ఆ స్మార్ట్‌ ఫోన్‌లో దాన్ని చూడొచ్చు. రూ.100 నుంచి రూ.3000 వరకు కాస్ట్‌ పడొచ్చు. దీనికన్నా హయ్యండ్‌ వర్చువల్‌ రియాలిటీ ని రూ.2 లక్షల ఖర్చుతో ఆక్యులస్‌ రిఫ్ట్‌గానీ, వైవ్‌గానీ హయ్యస్ట్‌ గ్లాసస్‌ దొరుకుతాయి. మేం చేసే బాహుబలి ఎక్స్‌ పీరియన్స్‌ ఆ గ్లాసెస్‌ కోసం చేస్తున్నాం. 
 
కమర్షియల్‌గా వయబుల్‌ లేదు కాబట్టి 200, 300 థియేటర్లలో వాటిని స్టాల్స్‌ పెట్టి మేం ఇస్తాం. ఎక్స్‌‌పీరియన్స్‌ చేయొచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటిది తొలిసారి బాహుబలి సినిమాలకే జరుగుతుంది. రూ.25 కోట్ల బడ్జెట్‌లో అది అనుభవంలోకి వస్తుంది. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్‌ రియాలిటీ హయ్యండ్‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను విడుదల చేస్తాం. దాంతో పాటు మేకింగ్‌ వీడియోస్‌ని వర్చువల్‌ రియాలిటీలో చేస్తున్నాం. డైరక్ట్‌ గా కావాలంటే ఫోన్‌లో ప్యాన్‌ చేసుకుని, గూగుల్‌ కార్డ్‌ బోర్డ్‌‌లోనూ చూడొచ్చు. 
 
మేకింగ్‌ వీడియోలను కూడా హైయ్యండ్‌ క్వాలిటీస్‌తో చేస్తున్నాం. ఫస్ట్‌ మేకింగ్‌ విఆర్‌ వీడియోస్‌ని ప్రభాస్‌ పుట్టినరోజుకి విడుదల చేయనున్నాం. ఈ రోజు మధ్యాహ్నం నేను తొలి టెస్ట్‌ చూశా. యూఎస్‌కి వెళ్లి వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీని గురించి తెలుసుకున్నా. రకరకాల కంపెనీల్లో వీడియోలు చూశా. నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా, మేం తీసిన టెస్ట్‌ షార్ట్‌ చాలా మంచి క్వాలిటీతో ఉంది. అది చెప్పడానికి గర్విస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.