గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (20:56 IST)

బాహుబలి 2 ప్రెస్ మీట్: పోస్టర్ రిలీజ్.. మీరూ చూడండి.. (photos)

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ''బాహుబలి: ది బిగినింగ్‌'' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' షూటింగ్ శరవేగంగా జరుగు

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ''బాహుబలి: ది బిగినింగ్‌'' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను రాజమౌళి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, రానా, రాజమౌళి, నిర్మాతలు పాల్గొన్నారు.
 
అలాగే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా టీజర్లను రిలీజ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా బాహుబలి టీమ్ ప్రకటించింది. అలాగే ఎప్పుడు ఏయో టీజర్స్, ఫస్ట్ లుక్‌లు వస్తాయో మీడియాకు క్లారిటీ ఇచ్చారు. వాట్సప్, ఫేస్‌బుక్ లలో బాహుబలి కథ ఇదే అంటూ ఓ కథనం ప్రచారంలోకి రావడంతో హడావుడిగా రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారని టాక్.