శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 9 మే 2017 (11:46 IST)

రూ.1000 కోట్ల బాహుబలి.. బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పేరుతో కొత్త వీడియో

ప్రముఖ దర్శకుడు జక్కన్న రూపొందించిన "బాహుబలి: ది కన్‌క్లూజన్'' రూ.1000 కోట్ల కలెక్షన్ల రికార్డును బద్ధలు కొట్టింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రలు పోషించిన

ప్రముఖ దర్శకుడు జక్కన్న రూపొందించిన "బాహుబలి: ది కన్‌క్లూజన్'' రూ.1000 కోట్ల కలెక్షన్ల రికార్డును బద్ధలు కొట్టింది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ పేర్లతో రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే.
 
ఈ సినిమా భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న సందర్భంగా...''బాహుబలి: ది కన్‌క్లూజన్‌.. నెం.1 బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా" పేరుతో 30 సెకన్ల ఓ వీడియోను విడుదల చేసింది. ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా పదిరోజుల్లోనే వెయ్యికోట్లు రాబట్టింది. అమెరికాలో వంద కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.
 
తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘ఒక ప్రాణం.. అంటూ సాగే పాటలతో ఈ వీడియో ప్రారంభం కాగా, మధ్య.. మధ్యలో "నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలనిపించిందా?’ అంటూ బిజ్జలదేవుడి ప్రశ్న.. ‘దేవసేన ఒంటిపై చేయి పడితే బాహుబలి కత్తిపై చేయి పడినట్లే'' అంటూ అమరేంద్ర బాహుబలి డైలాగ్‌, "మన నెత్తురే ఓ మహాసేన" అంటూ మహేంద్ర బాహుబలిగా ఉద్వేగంతో చెప్పే డైలాగ్‌లతో ఈ వీడియో అదుర్స్ అనిపించింది.