Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.1300 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2.. కన్నడంలో అనువాదానికి ఛాన్స్ ఇచ్చివుంటే?

ఆదివారం, 14 మే 2017 (11:10 IST)

Widgets Magazine

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించగా.. తాజాగా ఆ రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లని సాధించి ఎవరూ అందుకోలేని దిశగా దూసుకుపోతోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని బాహుబలి-2 వసూళ్లు చేసింది.
 
ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లని వసూల్ చేసింది బాహుబలి 2. అలాగే ఓవర్ సీస్‌లో కూడా రూ.240 కోట్ల వసూళ్లని సాధించింది. మొత్తంగా తీసుకుంటే.. రూ. 1300 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. తమిళం తరహాలో కన్నడంలో కూడా బాహుబలి-2 చిత్ర అనువాదానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. ఆయన శనివారం బళ్లారి సిటీలోని రాధిక సినిమా థియేటర్‌లో బాహుబలి-2ను వీక్షించారు.  బాహుబలి-2 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ శ్రమించడం ఈ విజయానికి దోహదపడిందన్నారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భారత్‌లో ద్రోణాచార్యులకు కొదవలేదు.. అర్జునులే ముందుకు రావాలి: రాజమౌళి

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న ...

news

విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్: ఓసేయ్ రాములమ్మ సీక్వెల్ కోసం జిమ్‌లో కసరత్తులు?

లేడీ బాస్, లేడీ అమితాబ్ అని పేరు తెచ్చుకున్న విజయశాంతి తిరిగి సినీ రంగంలో సెకండ్ ...

news

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం ...

news

చైతూ-సమ్మూ పెళ్లెప్పుడు..? రారండోయ్ వేడుక చూద్దాం.. అని చెప్పేదెప్పుడు.. ఫ్యాన్స్ ప్రశ్న

సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ...

Widgets Magazine