Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ తర్వాతి ప్రశ్న అడగనంటే చూపుతా.. బాహుబలిని కట్టప్ప చంపింది ఇక్కడే! గుట్టువిప్పిన రాజమౌళి

హైదరాబాద్, శుక్రవారం, 10 మార్చి 2017 (05:57 IST)

Widgets Magazine

ఒక్క డైలాగ్... భారతీయ సినీ ప్రేక్షకులనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మూవీ ఆడియన్స్‌ని వెర్రెత్తించేలా చేసింది. ఒక్క డైలాగ్.. ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత హైప్ సృష్టించి రెండేళ్లుగా ఒక ప్రశ్నకు సమాధానం కోసం కోట్లమందిని ఎదురు చూసేలా చేస్తోంది. ఒక పాత్ర.. తన చలనచిత్ర జీవితంలో తీసిన 250 సినిమాలు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు అంటూ పరమానందంతో తన చలనచిత్ర చరిత్రనే ఒక నటుడు కాదనుకునేలా చేసింది. ఇంతకూ ఆ డైలాగ్ ఏమిటి. బాహుబలిని చంపింది నేనే.. అని బాహుబలి ది బిగినింగ్‌లో కట్టప్ప చెప్పిన డైలాగ్. సినిమా ఆ డైలాగ్‌తోనే ముగిశాక సినీ ప్రపంచాన్ని వెర్రెత్తించిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి..
 
ప్రస్తుతం సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘బాహుబలి  ద కన్‌క్లూజన్‌’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా రచయిత, జర్నలిస్ట్‌ అనుపమ చోప్రా ‘బాహుబలి’ చిత్ర బృందాన్ని ఆ సినిమా సెట్‌లోనే ఇంటర్వ్యూ చేయగా, ఆ వీడియోను చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 
 
ఇంటర్వ్యూ కోసం ‘బాహుబలి  ద కన్‌క్లూజన్‌’ సెట్‌కు వెళ్లిన అనుపమ ‘ఇదేం సెట్‌’ అని దర్శకుడు రాజమౌళిని అడగ్గా, ‘కట్టప్ప బాహుబలిని చంపింది ఇక్కడే’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. ‘మీ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ తర్వాతి ప్రశ్న మీరు అడగొద్దు’ అని రాజమౌళి అనేసరికి నవ్వులు వెల్లివిరిశాయి. 
 
‘బాహుబలి’ కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. సెట్‌లో ఎవరిమీదా కోపంతో అరవలేదా అని అడగ్గా, ‘షాట్‌ గురించి సరిగా అనుకోనప్పుడు ఎవరైనా విసిగిస్తే అరిచేస్తా. అందరూ అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత అంతా కూల్‌. సెట్‌లో నేనూ ఓ మనిషినే’. అంటూ బదులిచ్చారు జక్కన్న. ఇక, ‘సినిమా విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్తారు’ అని అడగ్గా.. ‘విడుదలైన వారం తర్వాత లాంగ్‌ ట్రిప్‌కివెళ్లాలనుకుంటున్నా’ అని ఆయన చెప్పారు.
 
ఈ సందర్భంగా కథానాయకుడు ప్రభాస్‌ మాట్లాడుతూ.. రాజమౌళితో తనకున్న అనుబంధం కారణంగానే ఈ సినిమా ఒప్పుకొన్నానని, దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు ఇదేనన్నారు. సినిమాపై రాజమౌళికి ఉన్న ప్యాషన్‌ మమ్మల్ని ఎంతకాలమైనా వేచి చూసేలా చేసిందన్నారు. సినిమా గురించి హోంవర్క్‌ చేస్తాను కానీ, సినిమాలోని పాత్రలను ఇంటికి తీసుకెళ్లనన్నారు. తన తర్వాతి చిత్రాలు అభిమానులు మెచ్చేలా ఉంటాయన్నారు. రాబోయే ఓ చిత్రంలో కథానాయకుడి కన్నా కథే బలంగా ఉంటుందన్నారు.
 
నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు సత్యరాజ్‌ 
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ ఈ ప్రశ్నకు సమాధానం గురించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని సత్యరాజ్‌ అన్నారు. వారి నుంచి తప్పించుకునేందుకే దర్శకుడు చంపమంటేనే ఆ పని చేశానని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. అయితే ఎవరు ఎన్నిసార్లుఈ ప్రశ్న అడిగినా తనకు విసుగురాదని తెలిపారు. సినీ పరిశ్రమలో సుమారు 40ఏళ్ల నుంచి ఉన్నానని, సినిమా విలువ తెలుసని అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం తన కుటుంబానికి కూడా చెప్పలేదని సత్యరాజ్‌ తెలిపారు.
 
సినిమా మెత్తం ఓ ఛాలెంజ్‌ సాబుశిరిల్‌ 
‘బాహుబలి’ సినిమాలోని ఓ సన్నివేశాన్నో, ఓ పాటనో... ఛాలెంజ్‌గా తీసుకుని చేయలేదనీ... మొత్తం సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని చేశామని అన్నారు ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబుశిరిల్‌. రాజమౌళి సన్నివేశాల గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయానన్నారు. ఎంతో మంది పెద్ద దర్శకులతో పనిచేసిన తనకు రాజమౌళితో పనిచేయడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. ఐదేళ్లపాటు విసుగులేకుండా ఎంతో ఉత్సాహంగా పని చేశానన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Baahubali 2 Prabhas Kattappa Secrets Killed Bahubali Set Ss Rajamouli

Loading comments ...

తెలుగు సినిమా

news

మహిళా శక్తితో పెట్టుకున్నాడు... వర్మను 52,000 మంది అలా చేయాలనుకుంటున్నారు....

రాంగోపాల్ వర్మ ఏదయినా వంకరటింకరగా మాట్లాడుతారనే పేరుంది. ఆయన ఎందులోనైనా వంకర మార్గాన్ని ...

news

నిర్మాత నవీన్‌తో మలయాళ నటి భావన నిశ్చితార్థం... పెళ్లెప్పుడంటే...

మలయాళ నటి భావన నిశ్చితార్థం గురువారం నాడు చాలా సింపుల్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు ...

news

చాలా కాలానికి బిజీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్!

నటి సంజన చాలాకాలం తెలుగులో గ్యాప్‌ తీసుకుంది. ప్రస్తుతం పెద్ద చిత్రాలతో బిజీగా మారింది. ...

news

ప్రేమలో మనుషులు, మనసులు విడిపోతున్నాయి కాన్సెప్ట్‌తో 'పిచ్చిగా నచ్చావ్‌'.

'ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం ...

Widgets Magazine