శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:00 IST)

శివరాత్రి జాగారం ఇక్కడా? శివశివా... ఇలా చూడవచ్చా..? తమన్నా అందాలు...

శివరాత్రి సందర్భంగా ఒకే టిక్కెట్‌పై రెండు చిత్రాలు చూసేందుకు ఎగ్జిబిటర్లు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. ఇది చాలాకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒకప్పుడు ఎక్కువగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు అలా వేసేవారు. రానురాను కొత్త చిత్రాలు ఒకసారి రిలీజయి వెళ్ళిపోయిన

శివరాత్రి సందర్భంగా ఒకే టిక్కెట్‌పై రెండు చిత్రాలు చూసేందుకు ఎగ్జిబిటర్లు ఏర్పాట్లు చేయడం తెలిసిందే. ఇది చాలాకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఒకప్పుడు ఎక్కువగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలు అలా వేసేవారు. రానురాను కొత్త చిత్రాలు ఒకసారి రిలీజయి వెళ్ళిపోయినవి శివరాత్రి నాడు మరలా ప్రదర్శించేవారు. ఇప్పుడు ఆ కోవలోకి 'బాహుబలి' చేరింది. 
 
ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ఊహించని విజయాన్ని స్వంతం చేసుకుంది. హీరోకు శివుని పేరు... శివలింగాన్ని భుజాలపై మోయడం వంటివి.. శివరాత్రికి సింకయ్యేలా వుందనీ అందుకే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యామని ఎగ్జిబిటర్లు తెలియజేస్తున్నారు. 
 
ఇందుకు ప్రభాస్‌ ఫ్యాన్స్‌నుంచి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో సెకండ్‌ షోను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కాగా, ఈ షోకు సంబంధించిన టికెట్లు కూడా ఇప్పటికే సగానికి పైగా అమ్ముడు కావడం విశేషం. ఇకపోతే శివరాత్రి జాగారం చేయాలనుకునేవారు ఈ చిత్రాన్ని చూస్తారని అనుకుంటున్నారు. శివశివా... ఇలా చూడవచ్చా..? తమన్నా అందాలు...