గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (12:53 IST)

అమరావతికి బాహుబలి సాయం: ప్రీమియర్ షో ఫండ్ మొత్తం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఎక్కడెక్కడి నుంచో విరాళాలు అందుతున్న తరుణంలో బాహుబలి సినిమా ద్వారా కేపిటల్‌కు సాయం అందనుంది. బాహుబలి ద్వారా అమరావతి నిర్మాణానికి వారాహి సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సాయం అందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి వారాహి సంస్థలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. తాజాగా సాయి కొర్రపాటి ‘బాహుబలి’ చిత్ర కృష్ణాజిల్లా హక్కులను దక్కించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఈ నెల 10 తేదీన కావడంతో ఒకరోజు ముందే జూలై 9న విజయవాడతో సహా పలు ప్రదేశాల్లో ప్రీమియర్ షో వేసే ఆలోచనలో సాయి కొర్రపాటి ఉన్నట్లు తెలిసింది.

ఈ బెనిఫిట్ షోల ద్వారా వచ్చే మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చేందుకు కొర్రపాటి రెడీగా ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.