శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (14:01 IST)

బాహుబలితో రాజమౌళి శంకర్‌ని మించిపోయాడా..? బాహుబలి తర్వాత భారతం.. స్టూడెంట్ నెం.1 లేకుండా?

టాలీవుడ్ వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి.. ప్రస్తుతం భారత టాప్ డైరక్టర్‌గా మారిపోయాడని సినీ జనం అనుకుంటున్నారు. భారీ చిత్రాలను నిర్మించడంలో ఎప్పుడూ ముందుం

టాలీవుడ్ వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి.. ప్రస్తుతం భారత టాప్ డైరక్టర్‌గా మారిపోయాడని సినీ జనం అనుకుంటున్నారు. భారీ చిత్రాలను నిర్మించడంలో ఎప్పుడూ ముందుండే దర్శకుడు శంకర్‌కు రాజమౌళి పోటీగా నిలుస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్. బాహుబలి ఎఫెక్ట్‌తో దక్షిణాదిలో టాప్ దర్శకుడైన శంకర్‌కు రాజమౌళి పోటీగా మారిపోయాడని చెప్తున్నారు. 
 
ఇందుకు మహాభారతాన్ని తెరకెక్కించే పనుల్లో జక్కన్న ఉండటాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మహాభారతాన్ని అద్భుతంగా తెరకెక్కించడం.. సినిమాగా రూపొందించడం తన కలగా భావిస్తున్న రాజమౌళి.. ప్రస్తుతం కథకు తగిన పాత్రలను ఎంచుకునే పనిలో పడ్డాడు. బాహుబలి 2కి తర్వాత మహాభారత కథను రూపొందించే పనుల్లో మునిగిపోనున్నాడు. ఇప్పటికే తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మహాభారత స్క్రిప్ట్‌ను రెడీ చేసేశారు. ఈ కథకు అనుగుణంగా తారాగణం ఎంపిక జోరుగా జరుగుతోంది. 
 
ఇటీవల సినిమాలో ఇండస్ట్రీకి వచ్చి 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు రాజమౌళి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలు ఉన్నాయని, ఎన్టీఆర్ లేని మహాభారతం ఉండదని తన సన్నిహితుల దగ్గర మాట్లాడినట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్‌పై రాజమౌళికి ఉన్న నమ్మకానికి ఆ వ్యాఖ్యలు పరాకాష్టగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇదే తరహాలో ఈగ హీరో నాని, తమిళ హీరో సూర్యలకు కూడా మహాభారతంలో కీలక రోల్స్ ఇచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.