గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2015 (20:12 IST)

బాహుబలి సూపర్ హిట్‌కు పబ్లిసిటీయే కారణమా?

రెండు భారీ చిత్రాలు పోటీమధ్య ఒక సినిమాకే ఆదరణ వుంటే పబ్లిసిటీ స్టంట్‌ కారణమని చెబుతారు. ఇప్పుడు కన్నడలో  అదే చర్చ జరుగుతుంది. అక్కడ 10 కోట్లకు పైగా ఖర్చుపెట్టి తీసిన 'విక్రమాదిత్య' సినిమా కూడా బాహుబలి రిలీజ్‌ అయిన టైమ్‌లో విడుదలైంది. అయితే బాహుబలి వంద కోట్ల పైమాటేగా చెబుతున్నారు. 
 
విక్రమాదిత్యలో నటించిన పరేల్‌ యాదవ్‌ ఈ చిత్రంపై వివరణ ఇస్తూ.. బాహుబలి అంత కాకపోయినా ఈ సినిమా కూడా బడ్జెట్‌ పరంగా బాగా తీశారు. కానీ బాహుబలి స్ట్రెయిట్‌ సినిమాగా విడుదలై బాగానే ఆడింది. కానీ మా చిత్రం కూడా బాగా ఆడుతుంది. కానీ రావాల్సిన పేరు రావడం లేదని అంటున్నారు. దీనికి కారణం జాతీయ మీడియా కూడా బాహుబలి గురించే పెద్దగా చర్చించడం ఒక కారణంగా పేర్కొంది.