శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:24 IST)

తిరుపతిలో బాహుబలి టిక్కెట్ రూ. 3000

బాహుబలి-2. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేక్షకులకు బాహుబలి ఫీవర్ పట్టుకుంది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఒక కానిస్టేబుల్ బాహుబలి రిలీజ్ అయ్యే 28వ తేదీ తనకు సెలవు కావాలని లేఖ రాయడం ప్రస్తుతం తీవ్ర చర

బాహుబలి-2. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రేక్షకులకు బాహుబలి ఫీవర్ పట్టుకుంది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఉవ్విళ్ళూరుతున్నారు. ఒక కానిస్టేబుల్ బాహుబలి రిలీజ్ అయ్యే 28వ తేదీ తనకు సెలవు కావాలని లేఖ రాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే బాహుబలికి ఉన్న క్రేజ్‌ను డబ్బులుగా మార్చుకునేందుకు థియేటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. 
 
తిరుపతిలో ఒక్కో టిక్కెట్‌ను 3 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను విక్రయించాలన్న ఆదేశాలు ఉన్నా తిరుపతిలో మాత్రం ఇష్టానుసారం టిక్కెట్లను అమ్మేస్తున్నారు. ఎల్లుండి సినిమా విడుదల కానుండటంతో ప్రభాస్ అభిమానులు ఎంత డబ్బులు ఖర్చు పెట్టయినా కొనేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఒక్కో టిక్కెట్‌ను 3వేల రూపాయలకు విక్రయించేస్తున్నారు.
 
ఇప్పటికే తిరుపతిలోని అన్ని థియేటర్లలో 28వతేదీ బాహుబలిని సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్ల యజమానులు సిద్ధమయ్యారు. తిరుపతిలో ప్రధానంగా అన్ని హంగులు కలిగిన థియేటర్లు మూడు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే టిక్కెట్లను విక్రయించేశారు. మిగిలిన థియేటర్లలో సాయంత్రం నుంచి టిక్కెట్లను విక్రయించనున్నారు.