శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జులై 2015 (15:52 IST)

ఆస్కార్‌కు బాహుబలి: ప్రభాస్ 100 కేజీలు.. రానా 120 కేజీలు.. ఇంకా ఎన్నో..?

భారత భారీ బడ్జెట్ మూవీ అయిన బాహుబలి ఆస్కార్‌కు నామినేట్ కానుందని సమాచారం. భారతీయ ప్రతిష్టాత్మక సినిమాగా రూపుదిద్దుకున్న బాహుబలిలో ప్రతి సీన్లోనూ ఓ ప్రత్యేక ఉందని అందుకే ఈ సినిమా ఆస్కార్ అవార్డును నామినేట్ అయ్యే ఛాన్సుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
బాహుబలి ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యేందుకు కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే..
1. ఫిల్మ్ మేకర్ ఎస్.ఎస్. రాజమౌళి 600 మంది ఆర్టిస్టులు, 17 విజువల్ ఎఫెక్ట్ కంపెనీలతో పనిచేయడం 
2. ఫిల్మ్ మేనేజర్ కేకే సెంథిల్ కుమార్ పోస్ట్ -ప్రొడక్షన్స్ కోసం వేలాది మందిని నియమించడం, వేలాది రూపాయల ఖర్చుతో 24 నెలల సినిమాను రూపొందించడం, అన్నపూర్ణ స్టూడియో మొట్టమొదటి సారిగా డీఐ (డిజిటల్ ఇంటర్మీడియేట్‌)ను ప్రయోగించడం.  
3. మొట్టమొదటి సారిగా భారత్‌లో ఏసీఈఎస్ సర్కుల్యేషన్‌ను పరిచయం చేయడం.  
4. ఆర్టిస్టులకు భద్రత కల్పించడం, క్యారెక్టర్లను అద్భుతంగా మలచడం..  
5. బాహుబలిలోని ప్రతి క్యారెక్టర్‌కి స్టంట్స్ తెలిసుండటం, బరువును రెండింతలు పెంచేయడం.. 
6. ఆకాశాన్నంటే ఎఫెక్ట్స్, భారీ మొత్తం వెచ్చించడం.. 
 
7. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోవడం, వియత్నాంకు చెందిన వారితో కత్తియుద్ధాలను నేర్పించడం, పీటర్ హెయిన్ యాక్షన్ సీన్స్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేయడం..
 
8. ప్రభాస్ రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడం.. వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే సీన్‌ కోసం 25 రోజులు కష్టపడటం..  
9. ప్రభాస్ బాహుబలి క్యారెక్టర్ కోసం 100 కేజీలు పెరగడం, అలాగే భల్లాలదేవగా నటించిన రానా 120 కేజీలు పెరగడం.. ఇందుకోసం రోజుకు 30-40 వరకు కోడిగుడ్లు తీసుకోవడం.. వంటి ప్రతి విషయంలో ప్రత్యేకత ఉండటంతో ఈ సినిమా ఆస్కార్‌కు ఎంపికయ్యే ఛాన్సుందని తెలుస్తోంది.