గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 17 మార్చి 2017 (03:00 IST)

బాహుబలి.. బాహుబలి.. బాహుబలి.. తెలుగోడి మీసం తిప్పుతున్న బాహుబలి

దేశం మొత్తం ఈ సినిమా విడుదలకు ఎదురు చూస్తోందన్న విషయం తెలుసు గానీ, మరీ ఇంత ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తోందని మాత్రం, ఈ ట్రైలర్ విడుదలైన తర్వాతే తెలిసి వచ్చింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ ట్రైలర్ యూ ట్యూబ్ లో భూకంపం సృష్టిస్తూ.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీల

దేశం మొత్తం ఈ సినిమా విడుదలకు ఎదురు చూస్తోందన్న విషయం తెలుసు గానీ, మరీ ఇంత ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురు చూస్తోందని మాత్రం, ఈ ట్రైలర్ విడుదలైన తర్వాతే తెలిసి వచ్చింది. ప్రస్తుతం ‘బాహుబలి 2’ ట్రైలర్ యూ ట్యూబ్ లో భూకంపం సృష్టిస్తూ.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఉన్న రికార్డులనన్నింటిని తుడిచిపెడుతోంది. యూ ట్యూబ్ లో ఆకాశమే హద్దుగా “బాహుబలి 2” ధియేటిరికల్ ట్రైలర్ దూసుకు పోతోంది. ఇంతకుముందెన్నడూ చవిచూడని రికార్డులను ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తోంది.


గురువారం నాడు ఉదయం 10 గంటల సమయంలో విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 8 గంటలలోపే 10 మిలియన్ అంటే 1 కోటి క్లిక్స్ ను అందుకుని, ‘బాహుబలి 2’కున్న క్రేజ్ ఏంటో చాటిచెప్పింది. రాత్రి పదిగంటల సమయానికి ఒకటన్నర కోట్ల క్లిక్స్ దాటింది. ఇది ఒక్క తెలుగు భాషలోనే అని మర్చిపోవద్దు.
 
భారతీయ సినిమాలలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి రికార్డులు నమోదు కాలేదు. 2 కోట్ల క్లిక్స్ ను అందుకున్న టీజర్లు, ట్రైలర్లు చాలా ఉన్నాయి గానీ, కేవలం ఒక్క రోజు లోపే ఈ రికార్డులను అందుకున్నవి మాత్రం లేవనే చెప్పాలి. అయితే ఇది కేవలం 8 గంటలలో ప్రేక్షకులు చూపించిన ప్రభంజనం. మరి 24 గంటలు గడిచే పాటికి “బాహుబలి 2” ట్రైలర్ సునామీ ఏ స్థాయిలో ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా 20 మిలియన్ అంటే 2 కోట్ల క్లిక్స్ ను అందుకోవడం ఖాయంగా కనపడుతోంది. 
 
నిజానికి యూ ట్యూబ్ రికార్డులను కొల్లగొడుతుందని ముందుగా ఊహించిన విషయమే గానీ, మరి ఫస్ట్ డేనే మొత్తం తుడిచిపెట్టి వేస్తుందని మాత్రం అంచనాలకు అందనిది. ఇది కూడా కేవలం తెలుగు భాషకు సంబంధించిన ట్రైలర్ క్లిక్స్ మాత్రమే. జాతీయ భాష అయిన హిందీలో ఇప్పటివరకు 5 మిలియన్ క్లిక్స్ అందుకోగా, తమిళంలో 1 మిలియన్, మలయాళంలో హాఫ్ మిలియన్ క్లిక్స్ ను దాటింది. నిజంగా ఒక తెలుగు సినిమా ట్రైలర్ కు కేవలం 8 గంటలలో కోటి మంది క్లిక్స్ వచ్చాయంటే సాధారణ విషయం కాదు, అనితర సాధ్యం… అమోఘం..! బహుశా ఇప్పట్లోనే కాదు, మళ్ళీ రాజమౌళి ఏ మహాభారతమో తీసే వరకు ఈ “బాహుబలి 2” రికార్డులు పదిలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఒక తెలుగు సినిమాగా “బాహుబలి 2” సాధిస్తున్న రికార్డులను చూసి, దీనిని సృష్టించిన రాజమౌళిని చూస్తూ గర్వపడుతూ ప్రతి తెలుగు వారు ఆనందిద్దాం.
 
దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ ఇంతవరకు యూట్యూబ్‌లో సాధించిన హిట్ల సంఖ్య 78 లక్షలు మాత్రమే. కాని ఒక్కరోజులో ఇంకా చెప్పాలంటే కేవలం 12 గంటల్లో ఒక్క తెలుగులో మాత్రమే కోటిన్నర హిట్లు సాధించడం అంటే మహేష్ బాబు మాటల్లో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. 
 
తెలుగోడి మీసం రెండు నెలల క్రితం గౌతమీపుత్ర శాతకర్ణి తిప్పిన మాట నిజమే. ఇప్పుడు తిప్పుతున్న మీసం మాటలకందనిది. కుల, వర్గ, వర్ణ, రాజకీయాలకు అతీతంగా ఈ సినిమాను ప్రేమిద్దాం. అంతకు మంచి ఒక తెలుగు దర్శక దృశ్యమాంత్రికుడు నిర్మించిన మహాద్బుత మాయాజాలం చూసి పరవశించిపోదాం.