Widgets Magazine

పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితం కాదు.. ఆడవారి అవసరాలు తీర్చాలంటున్న బాబు...

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (10:13 IST)

Widgets Magazine
Babu Baga Busy Movie

అవసరాల శ్రీనివాస్ నటిస్తూ, నవీన్ మేడారం దర్శకత్వం వహించిన చిత్రం "బాబు బాగా బిజీ". ఈ చిత్రం వచ్చే నెల ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ చిత్రం 'హంటర్' ఆధారంగా రూపొందిస్తున్నాం. అవసరాల శ్రీనివాస్ పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది.
 
ఈ చిత్రం కథంపై అవసరాల మాట్లాడుతూ... "పెళ్లి, పెళ్లాం, పిల్లలే జీవితమనుకుంటే పొరపాటే. ఇంకేదో కావాలని ఆశపడాలి. ఎదుటివారిలోని అవసరాల్ని అవకాశాలు మలచుకోవడంలో బాబు సిద్ధహస్తుడు. అలాంటి బాబులో ఎలా మార్పు వచ్చింది? పెళ్లి చేసుకోవాలని అతడు ఎందుకు నిర్ణయించుకున్నాడు? అనేది తెలియాలంటే బాబు బాగా బిజీ సినిమా చూడాల్సిందే"నని అవసరాం అంటున్నారు. 
 
శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. నవీన్ మేడారం దర్శకుడు. మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీముఖి కథానాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. పెళ్లంటే సదభిప్రాయం లేని ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన అమ్మాయిలెవరు? వారి కారణంగా అతడు ఎలాంటి కష్టాలనెదుర్కొన్నాడు?అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. 
 
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు చక్కటి స్పందన వచ్చింది. సునీల్‌కశ్యప్ బాణీలు అలరిస్తున్నాయి. యువతరాన్ని ఈ చిత్రం తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకముంది అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ, సంగీతం: సునీల్‌కశ్యప్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ మేడారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ ముదురు హీరో బాగా వాడేశాడు... ఇక మాకెందుకు.. రెజీనాను పక్కనబెడుతున్న కుర్ర హీరోలు!

టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ...

news

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను ...

news

'ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి.. ఇంటికొచ్చాక చితక్కొట్టారు' : అంజలి

టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే ...

news

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ ...