శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 13 ఫిబ్రవరి 2016 (21:25 IST)

దుబాయ్ 'గామా' అవార్డ్స్‌లో 'బాహుబలి' దండయాత్ర

ఫిబ్రవరి 12, దుబాయి : ప్రతి సంవత్సరం దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ 3వ సంవత్సరంలో మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్. దుబాయి జబీల్ పార్క్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ గామా అవార్డ్స్ కార్యక్రమంలో బాహుబలి చిత్రం బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంది. ఈ అవార్డ్ అందుకోవడానికి బాహుబలి ప్రభాస్, రానా, తమన్నా, నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ స్వయంగా విచ్చేసి రెబల్ స్టార్ కృష్ణం రాజు, స్థానికి షేక్‌ల నుండి గామా మూవీ ఆఫ్ ద ఇయర్ ట్రోఫీని అందుకున్నారు.  
 
ఈ సందర్భంగా  ప్రభాస్ మాట్లాడుతూ, మొదటగా ఈ చిత్రం గురించి, రాజమౌళి గురించి 15 రోజులు మాట్లాడాలి, అంత టైం లేదు కాబట్టి, నేను ఎప్పట్నుంచో చెపుదామనుకుంటున్న విషయం దుబాయి తెలుగు వారి ముందు చెప్తున్నాను. మొట్టమొదట బాహుబలి కథ విని అందరం రాజమౌళితో కూచుని, బాహుబలి ఒకటే పార్ట్ అనుకున్నాం. కథ మొత్తం నెరేషన్ అయి పేపర్ మీదకి లెక్కలేసినాక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది కమర్షియల్‌గా వర్క్ అవుట్ అవదని రాజమౌళియే ప్ర్రొడ్యూసర్లకి చెప్పేసి.... ప్రభాస్‌తో బాక్సింగ్ బాక్‌డ్రాప్తో ఒక సినిమా చేద్దామని చెప్పేసారు. 
 
నిర్మాతలు ప్రభాస్ సంగతేంటి అంటే... అతను నా బెస్ట్ ఫ్రెండ్ నేను చూసుకుంటానని రాజమౌళీ చెప్పారు. కాని సినిమా అంటే ఎంతో ప్యాషన్ ఉన్న శోభు యార్లగడ్డ - దేవినేని ప్రసాద్‌లు ఎంత ఖర్చైనా ఫరవాలేదు మేము సపోర్ట్ చేస్తాం స్టాటిస్టిక్స్ చూసుకోవద్దు రాజమౌళి గారు మీరు నుంచోండి మేమున్నాం అంటూ ప్రాణం పోసిన నిర్మాతలు, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ఇంత రిస్క్ తీసుకున్నందుకు ఎంతైనా అభినందించాలి. నేను ఎప్పట్నుంచో ఈ విషయం చెప్దామనుకున్నా. కానీ అవకాశం రాలేదు.. వచ్చినా నేను ఎక్కువ మాట్లాడను.. అయాం సో థాంక్ ఫుల్.. టు దిస్ ప్రొడ్యూసర్స్.... అన్నారు
 
విభిన్న పాత్రలతో, రౌద్ర రసానికి ప్రతిరూపంగా ఉండే పాత్రలు, పౌరుషం ఉట్టిపడే పాత్రలలో నటించడమే కాక, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన రెబల్ స్టార్ కృష్ణం రాజుగారు లైఫ్ టైం అచీవ్ మెంట్  గామా అవార్డ్ అందుకుని తన ప్రతిస్పందన తెలియజేస్తూ.. మా రోజుల్లో నిర్మాతలకిచ్చే గౌరవం వేరు. నిర్మాత బతికితేనే సినిమాలో 24 క్రాఫ్ట్స్‌కి పని దొరుకుతుంది. అటువంటి నిర్మాత ఇప్పుడెక్కడున్నాడు. ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏంటి అనుకుంటున్న తరుణంలో నిర్మాతలంటే మేము అంటూ వందేళ్ళ తెలుగు సినీ చరిత్ర మొత్తాన్ని ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా బట్టబయలు చేసి హాలివుడ్‌కి ఏమాత్రం తగ్గకుండా.. అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. 
 
ఎప్పుడు హాలివుడ్ సినిమా చూసినా.. సినిమా అంటే ఇది. ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే బాగుణ్ణు అనుకుంటున్న తరుణంలో హాలివుడ్‌కి ధీటుగా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు రాజమౌళి. ప్రభాస్ ఆమధ్య నాతో మాట్లాడుతూ... పెదపాజి మీరు ఇండస్ట్రీకొచ్చి 50 యేళ్ళైంది... నేను అతి త్వరలో 50 యేళ్ళ పండగ అద్భుతంగా చేస్తా అన్నాడు. అలా అనుకోగానే .. ఇలా గామా అవార్డ్స్‌లో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ అని అనౌన్స్ చేసారు. నా యాభై యేళ్ళ నట జీవితానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇలా దుబాయిలో మొదలవడం చాలా సంతోషంగా ఉంది.
 
గామా అవార్డ్ 2015 విజేతలు వీరే 
క్యాటగిరీ ఆఫ్ అవార్డ్స్ : 
గామా బెస్ట్ మూవీ ఆఫ్ ద యియర్ - బాహుబలి
గామా లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డ్ - రెబల్ స్టార్ కృష్ణం రాజు
బెస్ట్ ఫిమేల్ సింగర్ : రమ్య బెహరా - ధీవర - బాహుబలి
బెస్ట్ సెలబ్రిటీ సింగర్ - లక్ష్మి మంచు - ఏందిరో ఈ మగాళ్ల గొప్ప - దొంగాట
బెస్ట్ టైటిల్ సాంగ్ : రామజోగయ్య శాస్త్రి - శ్రీమంతుడు
బెస్ట్ లిరిసిస్ట్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - కంచె - విద్వేషం
బెస్ట్ లవ్ సాంగ్ - ఎస్ ఎస్ తమన్ & జోనిత గాంధి - కిక్ 2 - నువ్వే నువ్వే 
బెస్ట్ డ్యూయెట్ సాంగ్ - కార్తిక్ - దామిని - పచ్చబొట్టేసిన - బాహుబలి
బెస్ట్ అప్ కమింగ్ సింగర్ - స్ఫూర్తి - కిక్ 2 - కిక్
బెస్ట్ కమర్షియల్ సాంగ్ - దేవిశ్రీ  ప్రసాద్ & శ్రావణ భార్గవి- సూపర్ మచ్చి - S/o   సత్యమూర్తి
బెస్ట్ పోయెటిక్ వాల్యూ సాంగ్ - శ్రీమణి - బెంగాల్ టైగర్ - చూపులతో
బెస్ట్ మ్యూజికల్ సాంగ్ - గోపి సుందర్ & రేణుక అరుణ్ - ఎందరో మహానుభావులు - భలే భలే మొగాడివోయ్
బెస్ట్ అప్ కమింగ్ లిరిసిస్ట్ - రామాంజనేయులు - కుమారి 21F - లవ్ చేయాలా వద్దా
బెస్ట్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ - బీంస్ శశిరోలియో - బెంగాల్ టైగర్
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - అనూప్ రుబెన్స్ - గోపాల గోపాల - బ్రహ్మాల
స్పెషల్ జ్యూరీ అవార్డ్ - చంద్రబోస్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ - తెలుగంటే
బెస్ట్ అప్ కమింగ్ సింగర్ మేల్ - యాజీన్ నిజార్ - శ్రీమంతుడు - చారు శీల & S/0 సత్యమూర్తి -  శీతాకాలం